32 బిసి కులాలకు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూ కేటాయింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 36 బిసి సామాజిక వర్గాలకు జిహెచ్ఎంసి పరిధిలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 60.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలోని రంగారెడ్డి, మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ 36 బిసి కమ్యూనిటీలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించనున్నారు. ఇందుకు సంభందించి ఆయా జిల్లాల్లో 67 ఎకరాల 30 గుంటల భూమిని కూడా కేటాయించారు. కేటాయించిన భూమిని ఆయా జిల్లా కలెక్టర్ల నుండి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం బిసి సంక్షేమ శాఖ కమిషనర్‌ను కోరింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన గత క్యాబినెట్ సమావేశంలో 36 బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించడానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించడానికి విడి విడిగా భూమి, నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.