Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి

Government wants to increase the Normal Delivery

నిజామాబాద్ క్రైం : సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం ఆదేశించగా వైద్యులు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జరిగిన సంఘటనలో పురిటిలోనే ఓ శిశువు మృత్యువాత పడింది. బోధన్ పట్టణంలోని రాకాసిపేటకు చెందిన చెన్నూరు చంద్రకళ, నందకిషోర్ దంపతుల మొదటి కాన్పుకోసం ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయించారు. కెసిఆర్ కిట్, గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలను ఆశించి వచ్చిన ఆ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. గత మూడు రోజుల క్రితం చంద్రకళకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ప్రసూతి వైద్యులు గౌతమి, సవిత వైద్యం అందించారు. గురువారం ఉదయం ఆ గర్భిణీకి నొప్పులు తీవ్రం అవడంతో సాధారణ కాన్పుకోసం వైద్యులు ప్రయత్నించారు. చంద్రకళ కడుపును బలంగా నొక్కుతూ శిశువును బయటకు తీసే ప్రయత్నం చేసారు. అయినప్పటికి ఫలితం లేక పోవడంతో చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించి పాపను తల్లి గర్భంలోంచి బయటకు తీసారు. అప్పటికే ఆ పాప మృతి చెందింది. గర్భిణీపై బలప్రయోగం చేయడంతోనే బిడ్డ కడుపులోనే కన్ను మూసిందని బాధితురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై బాధితులు ఆసుపత్రి సూపరిండెంట్ రాములును ప్రశ్నించగా ఆయన వైద్యుల చర్యలను వేనకేసుకొని రావడంతో ఆందోళనకు దిగారు. పసికందు మృతదేహాన్ని చేతిలో పట్టుకొని నిరసన తెలిపారు.

Comments

comments