Home జగిత్యాల మహిళల స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

మహిళల స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్

Koppula-Eshwar

ధర్మపురి: మహిళల స్వావలంబనే లక్షంగా చేతి వృత్తులు, చిన్న పరిశ్ర మలను ప్రభుత్వం ప్రోత్స హిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి మండల పరిషత్ కార్యలయంలో శనివారం కాయల్ బోర్డు సంస్థ ఆద్వర్యంలో కొబ్బరి పీచు పరిశ్రమపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ చేతివృత్తులు, చిన్న పరిశ్రమలను సద్వినియోగం చేసుకు ని ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు.

మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాన్ని మహిళలు సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ పథకంలో ఎంపిక చేయబడ్డ ప్రతి మహిళకు రూ. 2లక్షల నుండి రూ. 10లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుండగా 40శాతం సబ్సిడి, 55శాతం బ్యాంకు రుణం, 5శాతం లబ్ధిదారుల వాట ఉంటుందన్నారు. యంత్రాలు కొనుగోలు చేసి 100 రకాల వస్తువులను తయారు చేయవచ్చన్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రం అయినందున కొబ్బరి పీచు సైతం అందుబాటులో ఉంటుందన్నారు. వస్తువుల తయారికి ముడి సరుకు కావల్సినంత అందుబాటులో ఉందని, కొబ్బరి పీచుతో తాళ్లు డోరుమ్యాట్లు ఇతర అవసరమైన వస్తు వులను తయారుచేసి విక్రయించినట్లయితే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో లబ్ధిదా రుల ఎంపిక జరుగుతుందన్నారు.

శిక్షణకాలం 2నెలలుండగా నెలకు 2వేల చొప్పున భృతిని అందిస్తారని తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ ద్వారా ఎంపికైన 32 మంది లబ్ధ్దిదారులకు 51వేల చొప్పున చెక్కులను ఈశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొండపెల్లి మమత, జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్, సింగిల్ విండో చైర్మన్ బాదినేని రాజేందర్, వైస్ ఎంపిపి అయ్యోరి రాజేశ్, ఎఎమ్‌సి చైర్‌పర్సన్ అల్లం దేవమ్మ, కాయర్ బోర్డు ఇంచార్జి అధికారి కేశవ మూర్తి, తహసీల్దార్ కె మహేశ్వర్, ఎంపిడివో శశికళ, సర్పంచ్ సంగి సత్తమ్మ, ఎంపిటిసి రమేష్ తదితరులు పాల్గొన్నారు.