Home నాగర్ కర్నూల్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ కృషి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ కృషి

Governmental efforts to strengthen public schools

నాగర్‌కర్నూల్ డీఈఓ సోమి రెడ్డి

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందని, విద్యార్థ్తుల తల్లి దండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా విద్యను బోధించాలని నాగర్‌కర్నూల్ విద్యాధికారి సోమిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్ లో జిలాలోని మండల విద్యాదికారులతో డీఈఓ సమావేశమయ్యారు. ఈసందర్బంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బడిబాట నిర్వహించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం నుండి ఇదివరకే సరఫరా అయిన పాఠ్య పుస్తాకాలు, ఏకరూప దుస్తులను అందజేయాలని ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు తాము బోదించే సబ్జెక్టును పూర్తి సంసిద్దతతో బోదించాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండే పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో నోడల్ అధికారి కుర్మయ్య, ఏసీ రాజశేఖర్‌రావు, ఏఎంఓ అహ్మద్, వివిద మండలాల ఎంఈఓలు పాల్గొన్నారు.