Home మహబూబ్‌నగర్ ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్షం

ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్షం

government's goal is to provide water the house to house

నదీ జలాలను ప్రజలకు అందించడం సంతోషంగా ఉంది
ఇక ఆడబిడ్డలు బిందె పట్టుకుని రోడ్డుపైకి రాకూడదనే తమ లక్షం
ఇకనైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి
మన్యంకొండ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ట్రయల్ రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ టౌన్: మిషన్ భగీరథ పథకంలో భాగంగా మన్యంకొండలో నిర్మించిన 70 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ట్రయల్ రన్ ద్వారా నీటిని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విడుదల చేశారు. శనివారం మన్యంకొండలోని వాట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి గంగమ్మకు స్వాగతం పలికి ట్రయల్ రన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమి వస్తది అనే దానికి సమాధానంగా శ్రీశైలం బ్యాంక్ వాటర్‌ను మన్యంకొండ వద్ద ఉన్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తీసుకుని రావడం జరిగిందని, జిల్లా ప్రజలకు నదీ జలాలు అందించడం సంతోషంగా ఉందని, జిల్లాలోని 3 నియోజకవర్గాలలోని 13 మండలాలలో 259 గ్రామాలకు నీరు అందిస్తామని, ఏ రాష్ట్రంలో అ మలు కానీ పనిని మిషన్ భగీరథ క్రింద తాగునీరు అందించడం జరుగుతుందని, ఇంటింటికి నీరందించడమే ప్రభుత్వ లక్షమని, తెలంగాణ ప్రభుత్వ హాయంలో నాణ్యత ప్రమాణాలు పాటించి లీకేజీలకు తావు లేకుండా ట్రయల్ రన్‌ను విజయవంతం చేసిన మెగా ఇంజనీరింగ్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పని తీరు ఆమోదయోగ్యంగా ఉందని, కృష్ణా జలాలను జిల్లా ప్రజలకు వారి ఇంటి వద్దకే నల్లాల ద్వారా అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఆడ బిడ్డలు బిందె పట్టుకుని రోడ్డు వెంట నీటి కొరకు తిరగకూడదనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించామన్నారు. ఇంటింటికి నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ప్రభుత్వం తమదన్నారు. మంచి పనులకు అడ్డు తగులుతున్న ప్రతిపక్షాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. మిగిలిన పనులు పూర్తి చసి ప్రజలకు నీరు ందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులలో భాగస్వామ్యం వహించిన ఇంజనీర్లు, అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ ప్రశాంత్‌కుమార్, ఏఈఈ శివతేజ, మెగా ఇంజనీరింత్ ఎజెన్సీ జిఎం అనీల్, మిషన్‌భగీరథ అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.