Home జాతీయ వార్తలు కర్నాటక ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య

కర్నాటక ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య

Governor appoints BJP's KG Bopaiah as Pro Tem Speaker

బెంగళూరు: కర్నాటకం ప్రొటెం స్పీకర్‌గా బిజెపి ఎంఎల్‌ఎ కెజి బోపయ్య నియామకమయ్యారు. గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను నియమిస్తున్నట్లు ప్రకటించారు. 2009-13 మధ్యకాలంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు బోపయ్య స్పీకర్‌గా పనిచేశారు. బోపయ్యకు ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపితో అనుబంధం ఉంది. కాగా, ప్రొటెం స్పీకర్ నియామకం వివాదాస్పదంగా మారింది. బోపయ్య నియామకంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ ఎంఎల్‌ఎను స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ అని కాంగ్రెస్ తెలిపింది. సీనియర్ ఎంఎల్‌ఎగా కాంగ్రెస్ నేత ఆర్‌వి దేశ్ పాండే ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. రేపు సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ ఉన్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం అనివార్యమైంది.