హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇన్ కమ్ ట్యాక్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ నరసిహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదాయ పన్ను చెల్లించడమే కాదు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సిఎస్ ఆర్ ) కూడా చాలా ముఖ్యమని అన్నారు.ఇప్పటికే సిఎస్ ఆర్ చేస్తున్న కంపెనీలు వైద్య, విద్య రంగాల్లో సహాయం చేసే దిశగా ఆలోచించాలని గవర్నర్ సూచించారు. ధన బలం కంటే స్థాన బలం గొప్పదని తాను నమ్ము తానని అన్నారు. ఇప్పటికి గ్రామీణ ప్రాంత ప్రజలు సరైన వైద్యం, విద్యకి నోచుకోలేకపోతున్నారని గుర్తుచేశారు.ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ తీసుకొచ్చిన ఈ-రిటర్న్స్ సరైనదే కానీ కంప్యూటర్ ఇల్లిటరేట్స్ కి కష్టతరంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు