Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కడుపుకోత వద్దు

సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని తరలించొద్దు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన

గర్భిణీలు తీవ్ర ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు
ఎదుర్కొన్న విద్యార్ధులు, ఉద్యోగులు
matarnity-Hospital_manatelangana1సుల్తాన్‌బజార్: నగరంలోనే ప్రసిద్ధిగాం చిన ఆ సుపత్రులలో ఒకటైన, గత 100 సంవత్సరాలకు పైగా పేద రోగులకు వై ద్య సేవలు అందిస్తున్న కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని కో ఠి నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్నార ని తెలుసుకున్న రోగులు, వారి బంధువు లు ఆందోళనకు దిగడంతో కోఠిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొంది. తమకు అందిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే గురు వారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గర్భిణీ లు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్ర భుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. ప్రతిరో జు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓపి విభాగం 9 గంటలైనా ప్రారంభం కాకపోవడ ంతో గర్భిణీలు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇక్కడి నుండి ఈ ఆసుపత్రిని తీసివేశారని ఇక నుండి ఇక్కడ వైద్య సేవలు అందవని పుకార్లు రావడంతో నిన్నటి వరకు ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకున్నామని మరుసటి రోజే వైద్య సేవలు అందక పోవడమేమిటని వైద్య పరీక్షలకు వచ్చిన వందలాది మంది గర్భిణీలు, వారి బంధువులు కోఠి మహిళ కళాశాల చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న మహిళలను లాగేందుకు యత్నించిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిలో ఎక్కువ మంది గర్భిణీలు ఉండడంతో తమ ప్రయత్నాన్ని విరమించు కున్నారు. దీంతో సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి అక్కడి నుండి పంపివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రి ఓపి విభాగం ప్రారంభంకావడంతో గర్భిణీలు వైద్య పరీక్షల నిమిత్తం సంఘటన స్థలం నుండి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చు కున్నారు. ఆసుపత్రి వర్గాలే రోగులను రెచ్చగొట్టి రోడ్డుపై ధర్నాకు దిగేవిధంగా చేశారని పోలీసులు భావిస్తున్నారు.
ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు..
గర్భిణీలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన సమయం విద్యా సంస్థలకు, ఉద్యోగాలకు వెళ్లే సమయం కావడంతో కోఠి మహిళ కళాశాల చౌరస్తా నుండి చాదర్‌ఘాట్ వరకు, అబిడ్స్ వెళ్లే దారిలో ఉస్మానియా మెడికల్ కళాశాల వరకు వాహనాలు భారీగా నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో విద్యార్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Comments

comments