Home తాజా వార్తలు మున్సిపల్ బాధ్యతల నుంచి తహసీల్దార్ల తొలగింపు

మున్సిపల్ బాధ్యతల నుంచి తహసీల్దార్ల తొలగింపు

 tahsildars

ఎంపిడిఒలకు బాధ్యతల అప్పగింత
కీలక నిర్ణయం తీసుకున్న సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని తహసిల్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌నిచ్చింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న తహసిల్దార్లను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ సోమవారం అర్ధరాత్రి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో ఎంపిడివోలకు బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బదలీ చేసిన తహసిల్దార్లను పూర్వ జిల్లాలకు బదలీ చేయాలని కొద్ది రోజులుగా రెవిన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడంతో మంగళవారం నుంచి వర్క్ టు రూల్ పాటించాలని రెవిన్యూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో పాటు గా ఈ నెల 15వ తేదీ నుంచి సామూహిక సెలవులు పెడుతున్నట్లు అల్టిమేటం జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం 18 నగర పంచాయతీలు, మున్సిపాలిటీలకు అధికారులుగా కొనసాగుతున్న తహసిల్దార్లను బాధ్యతల నుంచి అగమేఘాలపై ప్రభుత్వం పక్కకు తప్పించింది. వారిలో రాయకల్ మున్సిపాలిటి అధికారిగా కొనసాగుతున్న రాయకల్ తాహసిల్దార్ స్థానంలో స్థానిక ఎంపిడివోకు బాధ్యతలను కట్టబెట్టింది. అలాగే ధర్మపురి, మక్తల్, భూత్‌పూర్, కోస్కి, మంచిర్యాల, తూముకుం ట, నందికొండ, ఖానాపూర్, చిట్యాల, మాలియా, చందూర్, ఆమంగల్, నరేడ్‌చర్ల, తిరుమలగిరి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, అమరచింతల తదితర మున్సిపాటీల బాధ్యతలను స్థానిక ఎంపిడివోలకు బాధ్యతలను కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Govt removes 18 tahsildars from civic chief duties