Home తాజా వార్తలు రూ.2000 నోట్లు కావలసినన్ని ఉన్నాయి

రూ.2000 నోట్లు కావలసినన్ని ఉన్నాయి

2000 notesన్యూఢిల్లీ: రూ. 2000 నోట్లను చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మరిన్ని నోట్లను ముద్రించడంపై ‘ఎటువంటి నిర్ణయం తీసుకోలేద’ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ వెల్లడించారు. అవసరానికి తగ్గట్టుగా రూ 2000 నోట్ల ముద్రణ జరిగిందని, ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో ఇవి 35 శాతానికి పైగా ఉన్నాయని ఆయన శుక్రవారం చెప్పారు. ప్రస్తుతం రూ.2000 నోట్లు అవసరానికి కన్నా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మళ్లీ రూ.2000 నోట్ల ముద్రణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం జరగలేదు, అని గర్గ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసిందని, వీటిని క్రమంగా చెలామణి నుంచి తప్పించనున్నదంటూ గురువారం వార్తలు వెలువడ్డాయి.

Govt says no decision taken on printing Rs 2000 notes, Printing of notes is planned per projected requirement and now, over 35 per cent of the notes in circulation are those of Rs. 2,000, Economic Affairs Secretary Subhash Chandra Garg said.