Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇం‘ధన’ సెగ!

The rise in petrol, diesel prices over the years

ఎంత వ్యత్యాసం… ఇదో ధరాఘాతం సామాన్యుడి నడ్డివిరిగేలా బండి ముందుకు కదిలించేందుకు జంకేలా పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా ఏడాదిలోనే ఇంధనం రోజుకింతలా మోత మోగుతోంది. మండుతున్న ధరలను చూసి ఉమ్మడి జిల్లాలో వాహనదారులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉన్న ఫలంగా గరిష్ట ధరకు పెట్రో ధరలు చేరుకోవడంతో వాహన చోదకులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.81.17, డీజిల్ ధర రూ.73.77 చేరడంతో భవిష్యత్తులో నెత్తిన మరింత భారం పడనుందనే దిగులు అందరిలో కనిపిస్తోంది.

మన తెలంగాణ/ఖమ్మం మయూరిసెంటర్ : మీరు బండి బయటికి తీస్తున్నారా..? కాస్త ఆలోచించాల్సిందే.. మునుపటిలా రయ్.. రయ్.. మని వాహనాన్ని తోలాలంటే.. జేబు లో చమురును వదిలించుకునేందుకు సిద్ధ పడాల్సిందే! నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు రూపాయిల్లో సెంచరీని కొట్టేందుకు చేరువగానే వెళుతున్నాయి. రోజుకిన్ని పైసల రూపంలో కనిపించని వాటా తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. అన్ని వర్గాల ప్రజలపై పరోక్ష ప్రభావానికి ఇది కారణంగా మారబోతోంది. మూడు వారాల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించని ప్రభుత్వ చము రు సంస్థలు ఇటీవల ఏక బిగిన ప్రజలకు వాత పెడుతున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని రకాల వాహనదారులకు ఇబ్బంది త ప్పడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. మూడు, నాలుగు చక్రాల వాహనాల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఇందుకోసం నిత్యం డీజిల్ ఎంతలేదన్నా.. రూ.6 లక్షల లీటర్లకుపైగా వాహనాల్లో వాడుతున్నారు. ఇక పెట్రోల్ వాడకం క్రమం పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 226 బంకుల్లో రోజులో సగటున మూడున్నర లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వాడుతున్నారు. ముఖ్యంగా నెలరోజులుగా  అనూహ్యంగా పెరిగిన ధరాఘాతాన్ని ప్రజలు భరించాల్సి వస్తుంది. ఒక్క ఏడాదిలో పెరిగిన ఇంధనం ధరలో జిల్లాలో వాహనదారులపై సుమారుగా రూ.48 కోట్ల అదనపు భారం పడింది. గతేడాది పెట్రోల్ ధర రూ.59.93 పైసలు ఉన్నప్పుడు రోజుకు వినియోగించే మూడున్నర లక్షల లీటర్లకు గాను రూ.2.15 కోట్ల అమ్మకాలు సాగేవి. అదే పెరిగిన ధర రూ.81.17 ఆధారంగా రోజుకు రూ.2.94 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఒక్కరోజు అమ్మకాల్లోనే రూ.78.66 లక్షల తేడా కనిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క పెరిగిన పెట్రోల్‌తో నెలరోజుల్లో రూ.23.58 కోట్ల భారం పడినట్టే..! ఇదే లెక్కన డీజిల్ విషయంలోనూ అదనపు మోత తప్పలేదు. జిల్లా వ్యాప్తంగా రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది. గతేడాది మే 22వ తేదీన ఉన్న ధర రూ.60.10 ఆధారంగా రూ.3.60 కోట్లు ఖర్చయ్యేది. అదే పెరిగిన ధర రూ. 73.77తో పోలిస్తే రూ.4.42 కోట్లు ఇంధనానికి ఖర్చవుతోంది. ఒక్కరోజులోనే రూ.82.07 లక్షల వ్యత్యాసం కనిపిస్తోంది. నెలరోజులు గమనిస్తే రూ. 24.62 కోట్ల భారం ప్రజల నెత్తిన పడినట్టే. మొత్తంగా ఇంధనాలకు ఏడాదికాలంగా రూ.48.20 కోట్ల భారం పడినట్టే.
పరోక్ష ప్రభావం : పెరుగుతున్న ధరల ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై తెలియకుండానే పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో వాహనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని వర్గాలపై ముప్పేట దాడిగా కనిపిస్తున్న వీటి విషయంలో నియంత్రణ కరువవడం సామాన్యులు, సగటు మధ్య తరగతి ప్రజలను కుంగదీస్తోంది

Comments

comments