Home తాజా వార్తలు ఖరీఫ్ కందిలో 75% మీరే కొనండి

ఖరీఫ్ కందిలో 75% మీరే కొనండి

govt wants to buy 75 per central government of the Kandhi production

కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి హరీశ్

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగవుతున్న కంది ఉత్పత్తిలో 75 శాతం మేర కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖమంత్రి టి.హరీశ్‌రావు త్వరలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. ఉత్పత్తిలో కొంత మొత్తమే కేం ద్రం కొనుగోలు చేయడం, మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మద్దతు ధరకు కొనుగోలు చేస్తే నష్టాలు మిగిలి, అప్పులే అవుతున్నాయని వివరించనున్నట్లు సమాచారం. అవసరమైతే అధికారులను వెంట తీసుకెళ్లి కేంద్ర మం త్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. ప్రస్తు తం కేంద్ర ప్రభుత్వం అర్థ, గణాంక శాఖ (డిఇఎస్) ముందస్తు అంచనాల ప్రకారం మద్దతు ధరకు కొనుగోలు పథకం (పిఎస్‌ఎస్) కింద సేకరణకు అనుమతిస్తుంది.

నిబంధనల ప్రకారం మొత్తం ఉత్పత్తిలో కేవలం 40 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయి. గత ఏడాది కంది సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, దిగుబడి 2.84 లక్షల టన్నులుగా ఉంది. అయితే మొదట ముందస్తు అంచనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కేవలం 75,300 క్వింటాళ్లకే అనుమతించింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు అండగా నిలిచేందుకు క్వింటాకు రూ.5450 మద్దతు ధరతో 1.13 లక్షల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇందుకు రూ.644 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంది. ఇప్పుడు సేకరించిన కందులకు మార్కెట్‌లో తక్కువ ధర టెండర్లు వస్తుండటంతో మార్క్‌ఫెడ్ నష్టపోతుంది. ఈ వానాకాలం సీజన్‌లో రైతులు కందులు 6.57 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి కూడా అధికంగా వస్తుండటంతో మంత్రి హరీశ్ ముందుగానే కేంద్రానికి 75 శాతం మేర కొనుగోళ్లు చేయాలని కోరనున్నట్లు తెలిసింది.