Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మహిళ సంక్షేమ కోసం ప్రభుత్వం పెద్దపీట

CHECK

మనతెలంగాణ/యదగిరిగుట్ట :తెలంగాణ ప్రభుత్వం అమలుపర్చిన కళ్యాణలక్ష్మీ లబ్ధి దారులకు, సీఎం సహాయనిధి లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ సునిత చెక్కులను పంపిణీ చెశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మండలంలో కళ్యాణలక్ష్మీ పథకం కింద 57మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 51 వేయి రూపాయల చెక్కులను 29 లక్షల 7 వేల రూపాయలు పంపిణీ చేశారు, ముఖ్యమంత్రి సహాయనిధి కింద 9 మందికి 2 లక్షల 22 వెల 500 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యాక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ సుమలత, ఎంపిపి గడ్డమీది స్వప్న, జడ్పిటిసి కర్రె కమళమ్మ, బూడిది స్వామి, తహశీల్దార్ రామకృష్ణ, ఎంపిటివో సాంబశివరావు, ఎంపిటిసి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments