Home నిర్మల్ ధాన్యం.. దైన్యం

ధాన్యం.. దైన్యం

Grain weight

దళారుల వద్దకే మొగ్గు చూపుతున్న రైతులు

దళారుల చేతిలో రైతు
ధాన్యం అమ్మకాల్లో మోసపోతున్న రైతులు
నగదుపై ఆంక్షలు
పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్: రైతు కష్టపడి పండించిన ధాన్యం అమ్మకానికి వెళ్లితే రైతు దళారుల చేతిలో కీలుబొమ్మగా మారుతున్నారు. దళారులు చెప్పిన మాటకు సరే అం లటే ధాన్యం కొనుగోలు జరుగుతుంది. ఒక పక్క ప్ర భుత్వం కొనుగోలు చేస్తునప్పటికి రైతు మాత్రం దళారులు వద్దకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ సెంటర్లలో మక్కకు క్విం టాల్‌కు రూ.1425 చెల్లిస్తున్నప్పటికి కొనుగోలు కేం ద్రాల్లో రైతులు రెండు మూడు రోజలుగా పడిగాపులు కాయా ల్సివస్తోంది . దీనికి తోడు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో సంచులు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రైతులు ప్రభుత్వ సెంటర్లలోనే అమ్మకాలు జరిపిన్నప్పటికి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు రాలేదు. దీంతో రైతు చేసేదేమి లేకా దళారుల వద్దనే అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీన్నే ఆసరాగా తీసుకున్న దళారులు తనకు ఇష్టం వచ్చిన రేట్‌తో కొనుగోలు చేస్తున్నారు.అంతేకాకుండా నగదు విషయంలో కూడా అనేక ఆంక్షలు విధిస్తున్నారు.దళారి పెట్టిన  షరతులకు ఒప్పుకున్న తరువాతనే ధాన్యన్ని కొనుగోలు చేస్తున్నారు.ముఖ్యంగా వెంటనే నగదు  కావాలంటే పర్సెంటేజిలా ప్రకారం నగదును పట్టుకోని ఇవ్వడం జరుగుతుంది.చెక్కు కావాలంటే ఒక రకం పర్సెంటేజి,అకౌంట్ ట్రాన్ఫర్ కావాలంటే ఓక రకం పర్సెంటేజి   వారం తరువాత నగదు కావాలంటే మరో రకంగా పర్సెంటేజిల పై దళారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.దీనికి తోడు క్వింటల్‌కు రెండు,లేదా మూడు కిలోల చొప్పున తూకంలో తక్కువగా చెల్లించడం జరుగుతుంది. రైతులు చేసేదేమి లేకా ఎంతకో అంతకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది.ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకున్న సరే నగదు తోందరగా వస్తే బాగుటుందని పేర్కొంటున్నారు.వర్షాలు,ఈదురు గాలులు రావడంతో తాము పండించిన ధాన్యం చేతికి రాదనే భయంతో నష్టంకు అయిన పంటను అమ్ముకోవాల్సి వస్తుందంటున్నారు.ఈ తతగాం అంత అధికారుల కళ్ల ముందట జరుగుతున్నప్పటికి అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు.కొన్ని చోట్ల మార్కెట్ యార్డ్‌ల ముందు దళారులు కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు అటు వైపు చూసిన ధాకలు లేవంటున్నారు.ఇప్పటికైన అధికారులు రైతులకు న్యాయం చేసేవిధంగా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.