Home రాష్ట్ర వార్తలు భారీగా అక్రమ ధాన్యం పట్టివేత

భారీగా అక్రమ ధాన్యం పట్టివేత

  • బీహార్ నుంచి బిల్లులు లేకుండా మిర్యాలగూడకు గూడ్స్‌లో తరలింపు
  • 120 లారీల్లో లోడింగ్

Illegal-Grains-Caughtనల్లగొండ : అక్రమంగా ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్న మిర్యాలగూడ రైసుమిల్లర్ల బాగోతం బట్టబయ లైంది. బిల్లులు లేకుండా రైలువ్యాగన్‌లో రవాణా చేసి మిర్యాల గూడలో లారీల్లోకి లోడుచేస్తూ విజిలెన్స్ అధికారులకు అడ్టం గా దొరికిపోయారు. వే బిల్లులు లేకుండా బీహర్ నుంచి గూడ్స్‌రైలు వ్యాగన్‌లో మిర్యాలగూడకు తరలించిన 120 లారీల ధాన్యాన్ని  నల్లగొండ విజిలెన్స్ డిఎస్‌పి సత్యన్న పట్టుకున్నారు. సమారు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బిల్లులు చెల్లించకుండా రాష్ట్రాలు దాటించి రైసు మిల్లర్లు మిర్యాలగూడకు చేర్చారు. గత జనవరి నుండి 20 రోజుల వ్యవధిలో 7 వ్యాగన్ల ధాన్యాన్ని అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. 8 వసారి తిరిగి అదే పద్దతిలో దిగుమతి చేస్తూండగా పక్కాసమాచారంమేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ధాన్యాన్ని తరలిస్తున్న 120 లారీలను పట్టుకొని మిర్యాలగూడ వాణిజ్య, పన్నుల శాఖాధికారి చిట్టిబాబుకు అప్పగించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రైస్ మిల్లర్ల గ్రూపులకు ఈ అక్రమ ధాన్యం   దిగుమతి అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మిర్యాలగూడలోని ఐదు మిల్లులకు ఈ లారీల ద్వారా ధాన్యాన్ని చేరవేస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమంగా దిగుమతిచేసుకున్న ధాన్యానికి రూ.25లక్షల మేరకు అధికారులు పన్ను వేయనున్నారు. కాగా భారీ ఎత్తున పన్నులు చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుండి మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల మిల్లర్లు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు. రైస్ మిల్లర్లు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని ఖరీదు చేయకపోవడంతో ఎంతో కష్టపడి పంటలు పండించిన జిల్లా రైతులు ధాన్యం కొనుగోళ్లు లేక విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి అధిక లాభాలు గడించేందుకు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమాలకుపాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా కేవలం పన్ను విధింపులతోనే సరిపెడితే మరిన్ని అక్రమాలు జరిగి జిల్లాలోని రైతులకు అన్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.