Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గ్రామ పాలనపై తర్జనభర్జన

Gram Panchayath Elections Preparation In Kamareddy

మన తెలంగాణ/కామారెడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు నిర్వహించడమా, ప్రత్యేక అధికారుల పాలనా, ప్రస్తుత ము న్న పాలకవర్గాలను పొడగించడమా అంశాలపై సర్కారు తర్జన భర్జన పడుతోంది. పంచాయతీ పదవీ కాలం దగ్గర పడుతుండడం, ఎన్నికల నిర్వహణపై స్టే ఉండడం అంశాలు కొలిక్కి రావడానికి సర్కారు న్యాయ పంచాయతీ నిపుణులతో చర్చలు జరుపుతుందని అధికార వర్గా లు తెలిపాయి. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనున్నాయి. ప్రస్తుతమున్న పాలకవర్గాలను తెలంగాణ సర్కారు కొనసాగిస్తుందా? రద్దు చేసి ప్రత్యే క అధికారుల పాలన క్రిందకు తెస్తుం దా? అని వేలాది మంది సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. లోకల్ పాలనను, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారుల క్రిందకు తీసుకురావడానికికి సర్కారు మొగ్గు చూపుతుందని సమాచారం ఎన్నికల నిర్వహణకు 95 శాతం పనులను ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ  సన్నాహాలు పూర్తి చేసింది.

రిజర్వేషన్ల ఖరారు తప్ప మిగతా పనులను ప్రభుత్వ శాఖలు పూర్తి చేసాయి. బ్యాలట్ బాక్స్‌ల సన్నాహలు కానిచ్చారు. బ్యాలట్ పత్రాలు ప్రింటింగ్ 80 శాతం పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి, అధికారులకు శిక్షణ తరగతులు ముగించారు. ఎన్నికల సిబ్బంది జాబితాలను తయారు చేశారు. దాదాపు ఎన్నికల నిర్వహణ పనులు పూర్తికావచ్చాయి. ఒక్క కీలకమైన రిజర్వేషన్ల ఘట్టం కోర్టులో కోర్టు ఆదేశాలతో బిసిల గణనకు 6 మాసాల సమయం పడుతుందని, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చెయాలని, కౌంటర్‌తో కోర్టు ఆటంకాలు తోలగితే పంచాయతీ ఎన్నికలు నెల ఆలస్యంతో ఆగస్టు ఒకటితో పంచాయతీల పాలన కాలం ముగుస్తుంది. కోర్టు అంతరాలతో ఏం చేయాలనేది సర్కారు సమాలోయనలు జరుపుతుందని యంత్రాంగం పేర్కోంది. ప్రత్యేక అధికారాల పాలన వైపు మొగ్గు చూపుతుందనే ఒక జిల్లా స్థాయి అధికారి అభిప్రాయపడ్డారు. 2012లో ఎన్నికల నిర్వహణకు న్యాయ ఆటంకాలు రావడంతో ఏడాది ఆలస్యంగా నిర్వహించారు. పిటిషన్ రావడంతో కొంత జాప్యం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. బిసి రిజర్వేషన్లు ఖరారు ముందు వారి ఓటర్లు ఎంత, ఏ మేరకు రిజర్వేషన్లు ఇస్తున్నారో తెలుపాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చెసిందని తెలిపారు. ఇంటింటికి తిరిగి బిసి లెక్క పూర్తి చేయాలని సర్కారును కోర్టు ఆదేశించడంతో ఎన్నికల నిర్వహణ పనులు ఆగిపోయాయి. మహిళా రిజర్వేషన్లు లాటరీ పద్దతిలో ఖరారు చేయాలని సర్కారు ఆత్తర్వులు పంపిందని య ంత్రాగం పేర్కొంది. సర్కారు రిజ

Comments

comments