Search
Sunday 22 July 2018
  • :
  • :

కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ ఉద్యోగుల ధర్నా..

Gram Panchayath Employees Do Strike Infront Of Collectorote

భువనగిరి కలెక్టరేట్ ః గ్రామ పంచాయతీ ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం రోజున గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కార్మిక నాయకులు మాట్లాడుతు వేతనాల పెంపు, పర్మినెంట్, ప్రమోషన్‌లు, వేతనాల గ్రాంటు వెంటనే అమలు చేసి ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో టిఆర్‌ఎస్‌కెవి, సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, ఎఐఎప్‌టియు, టిజిపిఈఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.

Comments

comments