Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గ్రామ జ్యోతి కన్వీనర్లకు 14 నుంచి శిక్షణ

Untitled-4సంగారెడ్డి: గ్రామ జ్యోతి కార్యాచరణ కమిటీ కన్వీనర్లకు ఈ నెల 14 నుంచి 21 వరకు పూర్తి స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన గ్రామజ్యోతి శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి ప్రణాళిక అత్యంత ఆవశ్యకమని, ఈ కారణంగా ప్రణాళికా తయారీలో శిక్షణ ఇవ్వదలిచామన్నారు. గ్రామ జ్యోతికి చెందిన ఏడు కమిటీల కన్వీనర్లకు ఈ నెల 14 నుంచి 21 వరకు శిక్షణనిస్తామన్నారు. శిక్షణ అనంతరం సంబంధిత కన్వీనర్లు సంబంధిత కమిటీలతో సమావేశమై ఆయా లక్షాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేస్తారన్నారు.

ఈ నెలాఖ రులోగా ఈ ప్రణాళికలు తయారు కావాలన్నారు. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కలు నాటేందుకు సరైన సమయమని అన్నారు. అందువల్ల గ్రామాల్లో తప్పకుండా మొక్కలు నాటాలని సూచించా రు. ఎంత వీలైతే అన్ని మొక్కలు నాటాలన్నారు. నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను పర్యవేక్షిం చాలన్నారు. అంతకుముదు పారిశుద్ధం, మంచినీరు, వైద్య ఆరోగ్యం, అంగన్ వాడీలు, విద్య, సంపూర్ణ అక్షరాస్యత, వ్యవసాయం, హరితహారం, పశు సంవర్థక శాఖ అంశాలపై శిక్షణనిచ్చారు. సమావేశంలో జడ్‌పి సిఇఓ మధు, డిపిఓ సురేష్‌బాబు, పిడి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments