Home తాజా వార్తలు దేశంలోనే తొలిసారిగా గ్రామజ్యోతి వెబ్‌సైట్

దేశంలోనే తొలిసారిగా గ్రామజ్యోతి వెబ్‌సైట్

gramajyothi_manatelanganaమహబూబ్‌నగర్: త్వరలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో గ్రామజ్యోతి వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి రేమాండ్  పీటర్  తెలిపారు. జిల్లా సర్పంచ్‌ల ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామజ్యోతి వెబ్‌సైట్ లో పంచాయతీలకు కేటాయించిన నిధులు, గ్రామ తీర్మానాలు, చేసిన పనులు, వసూలైన పన్నులు తదితర  వివరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రంలోని 5,700 గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరణ చేస్తామని ఆయన చెప్పారు.