Search
Thursday 20 September 2018
  • :
  • :

గ్రామజ్యోతితో వలసలు నిలిచిపోతాయి

17adkbr03p2నిర్మల్: గ్రామజ్యోతి పథకం ద్వారా లభించబోయే ప్రయోజనాలు పల్లె ప్రజల వలసలను అరికడతాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లొల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లడుతూ గ్రామీణ ప్రాంతాల సంపూర్ణ అభివృధ్ధి గ్రామజ్యోతి తోడ్పడుతుందన్నారు. 10రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల ద్వారా గ్రామజోతి పథకాని దిశనిర్ధేశం లభించబోతుందన్నారు.

గ్రామంలోని 7 కమటీలు సంపూర్ణ అభివృధ్ధికి ప్రాణాళికలకు రూపొందిస్తాయని తెలిపారు. గ్రామప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు తయారవుతాయాన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు అన్ని రంగాల అభివృధ్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. రోడ్ల నిర్మాణాలు, మురికి కాల్వల నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం, ఉపాధి కల్పన, స్వయం సంవృద్ధిలాంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత లభించబోతుందన్నారు. ప్రజలంతా తమకౌసరమయ్యే అభివృధ్ధి, సంక్షేమ పథకాలను గ్రామపంచాయతీల ప్రారంభంలోనే సాధించుకోవచ్చుని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామజ్యోతి పథకం భారతదేశం లోనే అదర్శంగా నిలవబోతుందని, ఇది ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక్ష స్థితిగతులకు అనుగుణంగా ప్రణాలికలు ఇక నుంచి రూపొందించ బడతాయన్నారు. గ్రామంలో మహిళలందరికీ ఉపాధి అవకాశాలు మెరగుపరుస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి సుమతి గోవర్థన్‌రెడ్డి, ఆర్డిఒ శివలింగయ్య, పంచాయతీరాజ్ ఈఈ మధుసూదన్, తహసీల్దార్ నారాయణ, సర్పంచ్ భీంరావ్, సింగిల్ విండో చైర్మన్ రామేశ్వర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు అల్లొల మురళిధర్‌రెడ్డి, ముఖ్యంరెడ్డి, జీవన్‌రెడ్డి, ఎంపి లింగన్న, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments