Home సంగారెడ్డి ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

Louis-Braille

మన తెలంగాణ/ సంగారెడ్డి ప్రతినిధి : అంధుల్లో ఉన్న మనో భలాన్ని ఇతరులు కూడ స్పూర్తిగా తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ అన్నారు. బుధవారం జిల్లా పరి షత్తు సమావేశ మందిరంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పా టు చేసిన లూయిస్ బ్రెయిలీ 208వ జన్మదిన వేడుకలలో  జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వారి జీవన శైలిని నిశ్చి తంగా చూస్తే దివ్యంగులలో ఆత్మగౌరవం ఆవగతమవు తుందన్నారు.

దివ్యంగులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ వెకన్సిలను వెంటనే భర్తీ చేస్తామని, కంప్యూటర్ శిక్షణ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకాశం, సదరన్ సర్టిఫికేట్లలో  పొరపా ట్లు దొర్లి  ఉంటే వాటిని సరి చేసి మళ్లీ జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చా రు. ఆదర్శ వివాహం చేసుకున్న వారికి రావాల్సిన ప్రోత్సాహ కాలను జాప్యం లేకుండా వెంటనే మంజూరు చేస్తామని చెప్పా రు. వికలాంగుల సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోతీ మాట్లా డుతూ అంధుల సమస్యలను గుర్తించి వారి విద్యావంతులు కావాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన బ్రెయిలీ లిపీని అంధులు సద్వినియోగ పర్చుకోవాలన్నారు.

విజిలెన్స్ కమిటీ సభ్యులు కూన వేణుగోపాల్ మాట్లాడుతూ వికలాంగులు తమకు తాము గౌరవించుకున్న నాడే ఇతరులు కూడా తమను గౌరవించే పరిస్థితి వస్తుందన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీ మాట్లాడుతూ అంధుల బ్రెయిలీని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాన్ని తీర్చిది ద్దుకోవాలని హితవు పలికారు. బ్రెయిలీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అంధులు గీతాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ  రంగాలలో ప్రతిభ కనబర్చిన అంధుల కు కలెక్టర్ సన్మానించారు. అంతకు ముందు అంధుల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలీ 208వ జన్మదిన వేడుకలను పురస్క రించుకొని పట్టణంలోని జిల్లా పరిషత్తు నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ వరకు అంధులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం  గ్రంథాలయంలో గల బ్రెయిలీ విగ్రహానికి కూన వేణుగోపాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వికలాంగ సంక్షేమ అధికారి మోతీలు పూలమాలలు వేశారు.  అంధ వికలాంగుల సంఘం తరపున నాయకులు బిక్షపతి, ప్రవీణ్‌కుమార్, అంధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు