Home కరీంనగర్ మనువరాలిని హతమార్చిన తాత

మనువరాలిని హతమార్చిన తాత

grand father killed his son daughter in karimnagar
హుజూరాబాద్: చిన్న పిల్లలకు తాతయ్యలంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే తాత దగ్గర ఉంటే కథలు వినిపిస్తాడు, నిద్రపుచ్చే పాటలు పాడుతాడు కాబట్టే. కానీ ఆడుతూ, పాడుతూ సరదాగా ఉండే ఓ చిన్నారిని ఓ వృద్దుడు కిరాతకంగా గొంతు నలిమి చంపిన సంఘటన హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మండల వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. సిఐ పి. దామోదర్‌రెడ్డి కథనం ప్రకారం… గ్రామానికి చెందిన నిజవపురం సంతోష్-సరితలకు సిరివల్లీ(6) కూమార్తె ఉంది. జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుంది. సంతోష్ వృత్తి రీత్య జమ్మికుంటలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమార్తె సిరివల్లీ స్వగ్రామమైన చెల్పూర్ గ్రామంలో తండ్రి రవి దగ్గర ఆదివారం రాత్రి ఉంచి వెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సిరివల్లీ మృతి చెందినట్టు మృతురాలి బాపమ్మ పేర్కొంటుంది. ఈ విషయంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతురాలి మేడపై తాత చేతి వేలి ముద్రలు ఉండటంతో పోలీసులు తాత రవిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా తన మనువరాలిని తనే చంపినట్టు ఒప్పుకున్నాడని పేర్కొన్నాడు. తన కుమారుడు సంతోష్‌ను తన కొడలు సరిత దూరంగా ఉంచుతుండటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిపారు. కాగా పోలీసులు ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు టౌన్ సిఐ పి. దామోదర్‌రెడ్డి తెలిపారు. కాగా మృతదేహాం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.