Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వానరానికి ఘనంగా అంత్యక్రియలు…

monkey-dead

మహబూబ్‌నగర్ : రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని శనివారం మృతిచెందిన వానరానికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లాంచనంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీచౌక్‌లో వానరం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సందర్భంగా వానరాన్ని రిక్షలో పెట్టి పూలమాలలు వేసి డప్పులు కొడుతూ తీసుకెళ్లి గ్రామ చివరలోని నల్ల చెరువులో దహాన సంస్కరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వీహెచ్‌పి అధ్యక్షులు బోలెమోని చంద్రశేఖర్, హిందూవాహిని అధ్యక్షులు రాజశేఖర్‌గౌడ్, అభిలాష్,చిన్నా,బుజ్జి తదితరులు ఉన్నారు.

Comments

comments