Home నిర్మల్ ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు

Nirmal

నిర్మల్ టౌన్: పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటైన నిర్మల్ జిల్లాలో మొదటి సారి నిర్వ హించిన 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మిని స్టేడి యం లో నిర్వహించిన వేడుకలను జిల్లా కలెక్టర్ ఇల్లంబరిది, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌లు, జెసి శివలింగయ్య, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతాన్ని అలపించారు. అనంతరం సాయుధ పోలీ సు దళాల గౌవర వందం స్వీకరించారు. పోలీస్ కవాతు మధ్య స్టేడియంలో తిరిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పరంగా అమలవుతున్న సంక్షేమ పథ కా లు, ఆయా శాఖల ద్వారా అమల వుతున్న పథకాలను వివ రించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివాసీలు, పాఠశా ల విద్యార్థులు, ఆయా శాఖల శకటలు, పోలీస్ కవా తులు, సంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు పలువురిని ఆకట్టుకు న్నాయి. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. శకటల ప్రదర్శనలో మొదటి స్థానంలో అటవీ శాఖ ఉండగా రెండవ, మూడవ స్థానంలో గృహణ శాఖ, ఆర్‌డబ్లూఎస్ శకటలు నిలిచాయి. వీరికి కలెక్టర్ మెమోంటోను అందజే శారు. అనంతరం ఆస్తుల పంపిణీలో భాగంగా వికలాం గులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసి స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో, పాఠశాలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎబివిపి ఆధ్వ ర్యంలో వివేకానంద విగ్రహం వద్ద, మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు జాతీయజెండాలను ఆవిష్కరించారు.

ఖానాపూర్‌లో

68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖానాపూర్,పెండి మం డలాల్లో గురువారం ఘనంగా జరిగాయి. ప్రభాత భేరిలో విద్యార్థులు దేశ నాయకుల వేషాదారణతో ఆలరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేందర్, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో లింబద్రి, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ విజయలక్ష్మీ, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ సక్కారం శ్రీనివాస్,వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీ హనీఫ్, గ్రామ పంచాయతీ కార్యాల యంలో సర్పంచ్ నేరేళ్ల సత్యనారాయణ, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై వినయ్, ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపల్ ఖలీక్, ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం భూమయ్య, తెలంగాణ తల్లి చౌరస్తా లో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గజేందర్, రాజీవ్ చౌక్‌లో కాంగ్రెస్ అధ్యక్షులు గంగరావ్, వివేకానంద చౌక్‌లో బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్, ఎన్టీఆర్ చౌక్‌లో టీడీపీ అధ్యక్షులు నయీం జాతీయ జెండాలను ఎగరవే శారు. పీఏసీఎస్‌లో అధ్యక్షులు ఆకుల వెంకగౌడ్, ఎఫ్‌ఆర్వో కార్యాలయంలో ఎఫ్‌ఆర్వో ఉత్తం రావ్, ఎఫ్‌బీఓ కార్యాల యంలో రవీందర్, ప్రెస్ క్లబ్‌లో అధ్యక్షులు నాగరాజు జెం డా ఎగరవేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యాం నాయక్, ఎంపిపి ఆకుల శోభ శ్రీనివాస్,జడ్పీటీసీ సునిత, ఎంపిటిసి రాజవ్వ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాసిపేటలో

కాసిపేట మండలంలో గణతంత్ర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి వాడలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసారు. మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఎంపిపి శంకరమ్మ, తహాసిల్దార్ కార్యాలయం ముందు పోలీసుల గౌరవ వందనంలో డిప్యూటి తహాసిల్దార్ రాజ లింగం, ప్రాథమిక పరపతి కేంద్రంలో చైర్మెన్ పుస్కూరి వంశీకృష్ణరావు, వ్యవసాయ కార్యాలయంలో ఎఓ వందన, ఐకెపి కార్యాలయంలో ఎపిఓ వెంకటేష్, కాసిపేట గనిపై మేనేజర్ సైదులు, ఓరియంట్ సిమెంట్ కంపెనీలో అధ్య క్షులు శివకాంత్ పాండే, కాసిపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సతీష్, దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీకాంత్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదానోపాద్యాయులు, ఆయ పార్టీల పతాకాల ను అన్ని పార్టీల అధ్యక్షులు, గనిపై ఆయా యూనియన్ల నాయకులు తివర్ణ పతాకాలనా ఎగురవేసారు. పాఠశాలల్లో విద్యార్థులచే పండగ వాతావరణం నెలకొంది.

నేరడిగొండలో

మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల లోని పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం 68వ గణతంత్ర దినోత్స వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయంలో కూనల గంగాధర్,సహకార సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు సాభ్లే నానక్‌సింగ్, ఎంపీడీఓ కార్యాల యంలో ఎంపీడీవో మహ్మద్ రియాజోద్దిన్, ఎంఈఓ కార్యా లయంలో భూమరెడ్డి,వ్యవసాయ కార్యాలయంలో మండల వ్యవసాయ విస్తీరణ అధికారి వెంకట్, ఐకెపి కార్యాలయం లో ఎపిఎం సుధర్శన్, ఆరోగ్య కేంద్రంలో వైద్యధికారి శ్రీధర్‌రెడ్డి, ప్రభుత్వ కళాశాలలో గులం దుర్రాణీ, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సాయిరెడ్డి వెంకన్న,గ్రంధాలయంలో శ్రీకా ంత్‌రావ్ జెండాలను ఎగుర వేశారు.గణతంత్ర దినోత్స వేడుకల సందర్బంగా నేరడిగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల,లఖంపూర్ ఆశ్రమోన్నత పాఠశాలలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యాక్రమాలు ఎంతోగాను అకట్టుకు న్నాయి. కార్యక్రమంలో మండల అధ్యాక్షురాలు బర్దల్ సునిత, జెడ్‌పిటిసి,స య్యద్ యస్మీన్, డిప్యూటీ తహసీల్దార్ పవాన్ చంద్ర,సూపర్‌డెంట్ చక్రపాణీ,విఆర్‌వో జయరావ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముథోల్‌లో

మండల కేంద్రంలోపాటు ఆయా గ్రామాల్లో గణతంత్ర దినో త్సవాన్ని గురువారం రోజున ఘనంగా జరుపుకున్నారు. మండల తహసీల్థార్ కార్యాలయంలో తహసీల్థార్‌సిడాం దత్తు త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు. అలాగే పోలీస్‌స్టేషన్ లో సీఐ రఘుపతి, మండల పరిషత్తు కార్యాలయంలో ఎం పీపీ అనూష సాయిబాబా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఫాతిమా, పంచాయతీరాజ్ కార్యాలయంలో డీఈ రాజకిషన్‌రె డ్డి, ఐసీడీఎస్ కార్యాలయం లో సీడీపీవో సుగుణ, ఐకేపి కార్యాలయంలో సమైఖ్య సభ్యురాలు పద్మ, మండల విద్య వనరుల కార్యాలయం ఎంఈవో మైసాజీ, స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ అనిల్, ఆశ్రమపా ఠశాల ప్రధానోపాధ్యాయుడు భోజరాం, గురుకుల పాఠశా ల ప్రిన్సిపాల్ సమత, గ్రామీణ వైద్యుల మండల అధ్యక్షుడు డాక్టర్ దుర్గా ప్రసాద్, స్థానిక ప్రెస్ క్లబ్‌లో అధ్యక్షుడు షఫీ వూల్లాఖాన్, ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రధానోపాధ్యాయులు, ఆయా కార్యా లయాల్లో అధికారులు, యువజన సంఘాల కార్యాల యాల్లో అధ్యక్షుడు తదితరులు జెండాను ఎగరవేశారు.

ఉత్తమ సేవలకు పురస్కారం

గణతంత్ర దినోత్సవాన్ని పుర స్కరించుకోని ముథోల్ ఎస్సై శ్రీనివాస్ సేవలను గుర్తింపుగా ఉ త్తమ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ ఇలంబర్తీ, జిల్లా ఎస్పీ విష్ణువారియర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

ఉట్నూర రూరల్‌లో

మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి కిరణ్‌కుమార్, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో విద్యాసాగర్, తహాశీల్దార్ కార్యాలయంలో తహాశీల్దార్ రాథోడ్ రమేశ్‌లతో పాటు ఎంపీడీవో, ఎంఈవో, ఆటవీ శాఖ కార్యాలయం, ఐసిడిఎస్, వ్యవసాయ, జీసీసీ కార్యాలయలతో పాటు తదితర ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో, గోండ్ రాజుల కోట లో గిరిజనులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గేయాన్ని ఆలపించారు. పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మండల కేంద్రంలో ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు, పాఠశాలలు, కళాశాలల, పార్టీల నాయకులు తదితరులున్నారు.

బాసరలో

బాసర మండల కేంద్రమైన బాసరలో గురవారం 68 గణత ంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం విద్యార్థులు ర్యాలీగా ఆయా విధుల గుండా ప్రభాత్‌పేరి నిర్వహించి అనంతరం మువ్వన్నెల పతకాన్ని ఎగరవే శారు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో కదం విశ్వనాథ్, గ్రామ పంచాయతీలో ఈవో తిరుపతి రెడ్డి, ఎస్‌బీహెచ్ మెనెజర్ మహేశ్ కుమార్, దక్కణ్ గ్రామీణ్‌బ్యాంక్ లింబా ద్రి, ఆలయ ఆవరణలో ఛైర్మన్ శరత్‌పాఠక్, బాసర పోలీస్ స్టేషన్ మహేశ్, ప్రాథమిక ఆస్పత్రి వద్ద డాక్టర్ వంశీ, ఎస్సీ ,బీస్సీ వార్డెన్‌లు కుమార్‌స్వామీ,నాగ్‌నాధ్, పశు వైద్య అధికారి డాక్టర్ రవీందర్, తహసీల్థార్ కార్యాల యంలో వెంకటరమణ, యువజన సంఘాలతోపాటు బాసర ట్రీపుల్ ఐటి కళాశాలలో వైస్ చాన్సులార్ సత్యనా రయణ త్రివర్ణ పతకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవ సందర్బంగా నిర్వ హించిన ఆటపోటిల విద్యార్థులు బహుమతులను అందజే శారు. దీంతో మండలంలోని కౌట, కిర్గుల్, సాలాపూర్, ఓని,బిద్రెల్లి , టాక్లీ , దొడపూర్ గ్రామాల్లో ఆయాగ్రామాల సర్పంచులు జాతీయ పతకాన్ని ఎగరవేశారు.
కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు స్వీకరణ

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలోని కలెక్టర్ ఇలంబ రీది చేతుల మీదుగా బాసర ఏఎస్సై నర్సయ్య, బాసర ట్రీపు ల్ ఐటి డీన్ సుధాకర్ ఉత్తమ అవార్డును అందు కున్నారు.

కడెం మండల అధికారులకు ఉత్తమ అవార్డులు

విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన మండల అధి కారులకు ఉత్తమ అవార్డులు దాక్కయి. మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు మానస, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి త్రిసంద్య, ప్రాథమిక సహాకార సంఘం పీఈఓ వజ్రవేలులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలంబరిది, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.

జైనథ్‌లో

68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కట్ట లక్ష్మి సురేష్, ఉప సర్పంచ్ కడదరపు లక్ష్మినారాయణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జైనథ్ ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ రాజశేఖర్, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో దుర్గం శంకర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి ప్రభాకర్, ఐకేపీ కార్యాల యంలో ఏపీఎం శుద్దోదన్, మహారాష్ట్ర బ్యాంక్‌లో మేనేజర్ సురేష్, డిజిబిలో మేనేజర్ భోజరెడ్డి, సబ్‌స్టేషన్‌లో ఏఈ జనార్ధన్, పోలీస్ స్టేషన్‌లో సీఐ జైపాల్, టీఎస్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ శివాజీ, కేజీబీవీలో ప్రిన్సిపల్ హేమలత, జడ్పీఎస్‌ఎస్ జైనథ్‌లో విజయసారథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తాంసిలో

గణతంత్ర దినోత్స వేడుకలను మండల కేంద్రంతో పాటు హస్నాపూర్, పొన్నారి, వడ్డాడి, కప్పర్ల, పిప్పల్‌కోటి, బండల్ నాగపూర్, భీంపూర్ మండలంలోని నిపాని, ధనోర, కరంజి, ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మంజుల శ్రీధర్‌రెడ్డి, తహ సీల్దార్ బడాల రాంరెడ్డి, ఎంపిడివో ఆకుల భూమయ్య,జడ్పీటీసీ పులి శ్రీలత, ఎస్సై మోహన్, మల్లేష్, తహసీల్దార్ రాజేశ్వర్, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

తానూర్‌లో

మండలంలోని 20 గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గురు వారం జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మండల కేంద్ర ంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాధ వ్‌పటేల్, వ్యవసాయ కార్యాలయంలో ఏడి అంజి ప్రసాద్, తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో రాజరాం, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాములు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడివో నాగ్‌నాథ్, ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, వాగ్దేవి పాఠశాలలో ఆరవిందరెడ్డి, వివేకానంద పాఠశాలలో రాజరెడ్డి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డా. మురళి కృష్ణ, వెటర్సీఆస్పత్రిలో డా. గోపాల్ మహాజన్, జూనియర్ కళాశాలలో ప్రినిపల్ భోజ రాం, పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సై గంగాధర్, సోసైటి కార్యా లయంలో చైర్మన్ నారాయణరావ్ పటేల్, కేజీబీవీలో ప్రధా నోపాధ్యాయులు అంజలి, ఎమ్మా ర్సీ కార్యాలయంలో ఎం ఈఓ సుభాష్, ఇంటి దీపంలో గంగ బాయి, వివిధ గ్రామా ల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లే జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ కార్య క్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు పాల్గొన్నారు.

బజార్‌హత్నూర్‌లో

మండలంలో గురువారం 68వ గణతంత్ర దినోత్సవ వేడుక లను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాతీలు, కళాశాలల్లో, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో తీవర్ణ పథకన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా క్రీడాలు, సంస్కృ తిక కార్యక్రమల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాలల్లో బహుమతులు అందజేశారు. ఆదర్శ పాఠశాల సభ్యులు చేసిన దేశభక్తి, నృత్యాలు అలరించాయి. జడ్పీటీసీ సభ్యులు మునేశ్వర్ నారాయణ, జిల్లా పరిషత్ పాఠశాలలో రాజ్య ంగం- అంబేద్కర్‌పై ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సోంరాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తరాటి భోజన్నతో పాటు ప్రజప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

జైనూర్‌లో

మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో, గ్రామ పం చాయతీ కార్యాలయాల్లో ఎంపిడివో, తహసీల్దార్ కార్యాల యాల్లో గురువారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరు పుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార శంక ర్‌గౌడ్, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో దత్తరాం, ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో వైద్యధికారి శ్రీనివాస్, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ రవికుమార్, వివిధ పంచాయతీ కా ర్యాలయాల్లో సర్పంచ్ మాడావి భీంరావ్, మేస్రం లక్ష్మణ్, మేస్రం గోవింద్, పెందూర్ అర్జున్ జెండాలను ఎగరవేశా రు. ప్రభుత్వ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవం సందర్భం గా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బ హుమతులను అందజేశారు. జడ్పీఎస్ పాఠశాలలో నాటక ప్రదర్శనలు, ఆటాపాటలు ఆందరికి ఆకట్టుకున్నాయి.