Home తాజా వార్తలు ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి

ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి

Chakali-Ilamma

మహబూబ్‌నగర్‌ః కొత్తకోట మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం ఘనంగా చాకలి ఐలమ్మ వర్థింతిని రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వామన్‌గౌడ్ ,మండల టిడిపి ప్రధాన కార్యదర్శి భరత్‌భూషన్, సర్పంచ్ చెన్నకేశవరెడ్డి హజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణకు పటెల్ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిందని వారన్నారు. ప్రతి మహిళ చాకలి ఐలమ్మను స్పూర్తితో తీసుకోని ముందుకు సాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మపల్లి బాలకృష్ణ, సత్యంయాదవ్,సంజీవుడు,జగన్, రజక సంఘం నాయకులు లక్ష్మయ్య,రాములు, తదితరులు పాల్గొన్నారు.