Home జాతీయ వార్తలు ఫోన్‌పగిలిందని నాయనమ్మను పొట్టనబెట్టుకున్నాడు..!?

ఫోన్‌పగిలిందని నాయనమ్మను పొట్టనబెట్టుకున్నాడు..!?

Brokened-Mobileబెంగళూరు: మొబైల్ ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో అంతే ప్రాణహానిని కూడా తలబెడుతున్నాయి. ఈ కొవలోనిదే కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటుచేసుకున్న తాజా ఘటన. తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పగలగొట్టిందన్న కోపంతో 90 ఏళ్ల నాయనమ్మను చెక్కతో కొట్టి చంపేశాడో మనవడు. నగరంలోని కదిరెనహళ్లి ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లో శివరాజ్(22) అనే యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌ను చార్జింగ్ పెట్టాడు. ఈ సమయంలో కంటిచూపు సరిగా లేని అతడి నాయనమ్మ లక్ష్మమ్మ అటువైపు వచ్చింది. దాంతో అనుకోకుండా ఆమె చేయి ఫోన్‌కు తాకడంతో కిందపడి ముక్కలైపోయింది. మొబైల్ కిందపడిన శబ్దం విన్న శివరాజ్ లోపలికి వచ్చి చూడగా ఫోన్ స్క్రీన్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉంది. దీంతో ఆగ్రహానికి లోనైనా శివరాజ్ పక్కనే ఉన్నా చెక్కతో లక్ష్మమ్మ మెడమీద గట్టిగా కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటంబ సభ్యులు ఆమెను పక్కకు తీసి పడుకోబెట్టారు. తర్వాతి రోజు ఉదయం లక్ష్మమ్మను నిద్రలేపగా ఆమె ఎంతకు లేవలేదు. దీంతో హూటాహూటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ లక్ష్మమ్మ అప్పటికే చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పోలీసులు శివరాజ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.