Search
Monday 24 September 2018
  • :
  • :

హామీలు నెరవేర్చండి

kcr

ఎయిమ్స్, ఐఐఎంలను మంజూరు చేయండి 

వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయండి
పాత తొమ్మిది జిల్లాలను బ్యాక్‌వర్డ్‌గా గుర్తించినందుకు కృతజ్ఞతలు
పెంచిన ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని కొనసాగించండి
ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రితో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్
అడిగిన వాటికి సుముఖంగా స్పందించిన అరుణ్ జైట్లీ

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: తెలంగాణకు కేంద్రం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలుసుకొని కోరారు. రాష్ట్రానికి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, అందుకు తగిన నిధులు విడుదల చేయాలని, అదే విధంగా గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట ఇచ్చిన మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని, అలాగే పెంచిన రుణపరిమితి (ఎఫ్‌ఆర్‌బిఎం)ని 3.5 శాతం వద్దనే కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 2014 నుండి 2017 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు రూ. 450 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్ల నిధులు కేం ద్రం విడుదల చేసిందని చెబుతూ 2017-18 సంవత్సరాని కి వెనుకబడిన జిల్లాలకు ఇంకా నిధుల విడుదల కాలేదని ఆర్థికమంత్రికి గుర్తు చేశారు. వాటిని వెంటనే విడుదల చేయడానికి జైట్లీ అంగీకరించినట్లు సమాచారం. పాత పది జిల్లాల్లో తొమ్మిదింటిని వెనుకబడినవిగా గుర్తించినందుకు జైట్లీకి కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిఎంతో పాటు ఎంపి జితేందర్ రెడ్డి, అధికారులు రాజీవ్ శర్మ, రామకృష్ణారావు, నర్సింగ్‌రావులు ఉన్నారు.

Comments

comments