జిల్లాకు 1620 ఉచిత విద్యుత్ కనెక్షన్ల మంజూరు
కేంద్రం పథకాన్ని ప్రకటించి సంవత్సరం గడిచింది
డిపిఆర్ పంపి 3 మాసాలైనా ఎక్కడ వేసినగొంగళి అక్కడే
జిల్లాలో దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేదలందరికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఉద్ధ్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ‘సౌభాగ్య’ పథకం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం గతే డాది జూన్ మాసంలో ఈ పథ కాన్ని ప్రకటించిన కేంద్రం ఏడాదైనా కదలిక లేకపో వడంతో బీపీఎల్ కుటుంబాలకు ‘సౌభాగ్య’ం దక్కేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పేదల ఇళ్ళల్లో వెలుగులు నిం పేందుకు తీసుకొచ్చిన ఈ పథకం తొలి విడతలో భాగంగా జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 1620 ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది. నల్ల గొండలో 560, మిర్యాలగూడ 560, దేవరకొండ 500 మేర మొత్తం జిల్లాకు 1620 సౌభాగ్య విద్యుత్ కనెక్షన్ లు ప్రతిపాదించారు. అయి నా నేటికి ఎక్కడవేసిన గొంగ ళి అక్కడే అన్నట్లు ఉంది.
-మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి