Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఇఫ్తార్ విందులకు నిధుల మంజూరు…

ఇఫ్తార్ విందులకు నిధుల మంజూరు…

 Iftar Feasts

 

ఆసిఫాబాద్ : మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఇప్తార్ విందు, గిఫ్ట్ ప్యాకెట్ పంపిణిపై జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు , జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ట్రైని కలెక్టర్ హేమంత్, సంయుక్త పాలనాధికారి పి. రాంబాబులు రెండు నియోజక వర్గాల మసీదు కమిటి అధ్యక్షులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు మొత్తం గిఫ్ట్ ప్యాకెట్స్ ఆసిపాబాద్‌కు 1500, కాగజ్‌నగర్ 200 0లు వచ్చాయన్నారు. అలాగే ఇఫ్తార్ విందుకు ఆసిఫాబాద్‌కు మూడు లక్షల రూపాయలు, కాగజ్ నగర్ నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

రంజాన్ పండుగను ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా సామరస్యంగా జరుపుకోవా లన్నారు. మసీదు కమిటి పెద్దలు మాట్లాడుతూ గిఫ్ట్ ప్యాకెట్ ఇఫ్తార్ విందులకు ఇచ్చే నిధులు సరిపోవడం లేదని ఇంకాస్త పెంచాలని కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని, వచ్చే రంజాన్ నాటికి ఎక్కువ నిధులు కేటాయించేలా చూస్తాన్నారు. ఈ సమావేశంలో ఆర్డీలు సిడాం దత్తు, శివకుమార్, మైనార్టీ సంక్షేమాదికారి శ్రీనివాస్, మసీదు కమిటి మెంబర్స్ షేక్ అసద్, సలామోద్దీన్, జాకీర్, సుబాన్, ఖాదీర్, తదితరులు పాల్గొన్నారు.

Granted Funds to Iftar Feasts