Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ముస్లింలకు ప్రభుత్వం చేయూత

Granted subsidy loans to poor people

నియోజకవర్గంలో ఈద్గాల అభివృద్ధికి రూ.1.80 కోట్లు
నిరుపేద యువకులకు సబ్సిడీ రుణాల మంజూరు
రంజాన్ పండుగలో పాల్గొని ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన: రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖమంత్రి  ఈటల రాజేందర్

మనతెలంగాణ/జమ్మికుంట: నాటి పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారు తప్ప ఏనాడు వారి కష్టసుఖాల కోసం ఆలోచించిన పాపాన పోలేదని తెలంగా ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచాలనే సంకల్పంతో సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలతో చేయూత నివ్వడంతోపాటు రంజాన్ పండుగను ప్రభుత్వ పండుగగా గుర్తించి నిరుపే ద ముస్లింలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాలతో పాటు ప్ర భుత్వ పరంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ప్రభుత్వం దేశంలోనే ఒక్క తెలంగాణ ప్రభుత్వ మాత్రమేనని రాష్ట్ర ఆ ర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అ న్నా రు. శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు స్థానిక ము స్లిం లు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా వద్ద ము స్లింలు ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. ఈద్‌ ఉల్‌ ఫీతర్ సం దర్భంగా మంత్రి ఈటల రాజేందర్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భ గా మంత్రి ఈటల రాజేందర్ ముస్లిం సోదరులకు రంజాన్ ప ర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద ముస్లిం యువతకు ఏకనమికల్ సపోర్ట్ స్కిం కింద 80వేల రూపాయల సబ్సిడీతో లక్ష రూపాయలు అందజేస్తామని ఈ స్కీం వచ్చే నెల నుంచి అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని మసిద్‌లు ఈద్గాల అభివృద్ధి కోసం కోటి 80లక్షల రూపాయల నిధులు మంజూ రు చేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలో 201 మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ ప్రారంభించ గా నియోజకవర్గంలోని హుజురాబాద్‌లో బాలలకు జమ్మికుంటలో బాలికల కోసం రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చే సినట్లు మంత్రి తెలిపారు. జమ్మికుంట పట్టణంలో 510 డ బుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నామని అందులో నిరుపేల ముస్లీంలకు కూడా అవకాశం కల్పిస్తామని నిర్మాణాలు పూ ర్తి కాబోతున్నాయని అన్నారు. బ్రోకర్లను మధ్య దళారుల ను నమ్మి మోసపోవద్దని ఏ ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వద్దని మ ంత్రి తెలిపారు. నిరుపేద ముస్లింలు ఆడపిల్ల వివాహాం చేయాలంటే అప్పులు చేసి ఇబ్బంది పడేవారని తెలంగాణ ప్రభుత్వంవచ్చాక ప్రతి అడపిల్ల వివాహనికి షాదిముబా రక్ పేరుతో లక్ష రూపాయలకు పైగా చెక్కు పెండ్లికి ముందే అందజేస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో మైనార్టీల అభివృద్ధి కో సం మరిన్ని సంక్షేమ ప్రథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాల అదుకునేందు కెసిఆర్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి సహకార సంఘాల యూనియన్ రాష్ట్ర అద్యక్షులు తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు ఇల్లందకుంట దేవస్థాన చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి కౌన్సిలర్ చంద రాజ్ టిఆర్‌ఎస్ అర్బన్ అద్యక్షులు పొనగంటి మల్లయ్య నాయకులు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు సమ్మరావు కోమ్ము అశోక్ గుల్జార్ మ సిద్ అధ్యక్షుడు ఎం.హుస్తేన్ ఇమామ్ జహిర్‌ల్ ఖాద్రి మండల కోఅప్షన్ సభ్యులు సయ్యద్ సమీ ర్ నాయకులు ఖాదీర్ రుస్తుంఅక్బర్ పర్వేజ్ రుస్తుం జాని తదితరులు పాల్గొన్నారు.

Comments

comments