Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

గుమ్మడి గింజలతో అందం, ఆరోగ్యం

Magaz-Seeds

మగజ్ గింజల్లో (మంచి గుమ్మడి, పుచ్ఛకాయ, దోసకాయ గింజలు) శరీరానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. ప్రొటీన్, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు ఈ గింజల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటిని అన్ని రకాల స్వీట్లలో వాడవచ్చు. బరువు పెరగాలనుకున్నవారు వీటిని తింటే త్వరగా బరువుపెరుగుతారు. వెంట్రుకలు ఆరోగ్యంగా మెరుస్తూ  ఉండాలంటే, వెంట్రుకలు రాలడం తగ్గడంలో ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. వీటిలో ఉండే ఒలెక్ యాసిడ్, లినోలెమ్ యాసిడ్ చర్మాన్ని మెరిసే విధంగా కాపాడుతుంది. పురుషుల్లో వీర్యం వృద్ధి చెందడానికి వీటిలో ఉండే అమినో యాసిడ్, లైకోపీన్ దోహదపడతాయి. అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉన్న ఇవి రక్తంలో చెక్కర స్థాయిని తగ్గిస్తాయి. ఈ గింజలను ఒక లీటరు నీటిలో  గంటసేపు ఉడికించి, వడగట్టి టీకి బదులుగా తాగవచ్చు.

Comments

comments