Home వికారాబాద్ అనంతగిరికి పోటెత్తిన భక్తులు

అనంతగిరికి పోటెత్తిన భక్తులు

rrవికారాబాద్ టౌన్ : అదివారం సెలవు దినం కావడంతోపాటు జాతర కావడంతో అనంతగిరి అనంతపద్మనాభస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.  కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో హైదరాబాద్ పరిసర జిల్లాలనుండి  పర్యాటకులు భక్తులతో అనంతగిరి పరిసరాలు సందడిగా కనిపించాయి. దేవాలయంలో సాధారణ దర్శనంకోసం భక్తులు గంటల తరబడి వేచి చూశారు. విఐపి దర్శనం క్యూలైన్‌లోనే 2 గంటల సమయం తీసుకున్నదంటే  అర్థం చేసుకోవచ్చు. భగీరథ గుండంలో స్నానం ఆచరించటానికి వెళ్ళే మెట్ల దారి జనంతో కిక్కిరిసి పోయింది. దేవాలయం ప్రాంగణంలోనో ఉసిరి చెట్టు వద్ద, గణేశుని విగ్రహం వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. దర్శనం అనంతరం గుట్ట కింద ఉన్న నందీ విగ్రహం దగ్గర సేదదీరి వనభోజనాలు చేశారు.