Home జగిత్యాల ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

Great road accident

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం                                                                                                      చందోళిలో విషాదఛాయలు

మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ సమీపంలో ధర్మారం – జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగి న రోడ్డు ప్రమాదంలో చందోళి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకే కు టుంబానికి చెందిన అన్న, తమ్ముడు, తమ్ముడి కుమారుడు ముగ్గురు మృత్యువాతపడటంతో చందోళిలో వి షాద ఛాయలు అలుముకున్నాయి. గొల్లపల్లి పోలీసు ల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చందోళి గ్రా మానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు చిప్ప రాములు (50), అతడి తమ్ముడు చిప్ప సందీప్ (47) సందీప్ కుమారుడు వినోద్ (27)లు గొల్లపల్లి మండల కేం ద్రంలోని తమ బంధువుల ఇంట్లో మంగళవారం సా యంత్రం జరిగిన పుట్టిన రోజు వేడుకకు వెళ్లారు. వేడు క అనంతరం భోజనం చేసి రాములు ద్విచక్రవాహనంపై రాములుతో పాటు అతడి తమ్ముడు సందీప్, సందీప్ కుమారుడు వినోద్‌లు తిరుగు ప్రయాణమయ్యారు. చిల్వాకోడూర్ సమీపంలోకి వచ్చే సరికి ఎ దురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం అతివేగం గా వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో తీవ్ర గాయా ల పాలైన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. కరీంనగర్‌కు వెళ్లి వస్తున్న గొల్లపల్లి జెడ్పీటీసీ భర్త జెలెంధర్ రోడ్డుపై శవాలు పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ద్విచక్రవాహనం నెంబ ర్ ఆధారంగా చందోళికి చెందిన చిప్ప రాములుగా గుర్తించారు. వెంటనే వారు ఫోన్ ద్వారా రాములు కు టుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అ క్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. గొల్లపల్లి ఎస్ ఐ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జ రుపుతున్నారు. కాగా ముగ్గురి మృతికి కారణమై న వాహనం ఏ మిటనేది ఇంకా తెలియలేదు.

కన్నీటి సంద్రమైన చందోళి
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో చందోళి గ్రామం కన్నీటి సంద్రమైంది. ఆర్‌ఎంపిగా పని చేస్తున్న చిప్ప రాములు అం దరితో కలివిడిగా ఉండటంతో పాటు ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ సాయమందించే వాడు. అ లాగే అతడి తమ్ముడు సందీప్ వ్యవసాయం చేస్తుండ గా తమ్ముడి కొడుకు వినోద్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ముగ్గురు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బం ధువులతో పాటు ఊరు ఊరంతా కదిలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాములుకు భార్య ప్రేమలత, కూ తుళ్లు దివ్య, శ్రీ విద్య ఉన్నారు. సందీప్‌కు భార్య సుశీల, ఇద్దరు కుమారు లు ఉండగా పెద్దకుమారుడు వి నోద్ తండ్రితో పాటే మృతి చెం దగా అతడి చిన్న కుమారుడు మోహన్ తండ్రి, అన్న ,బాబా యి మృతి చెందడంతో షాక్‌కు గురయ్యాడు. పలుమా ర్లు స్పృ హ తప్పి పడిపోయాడు. మృతు లకు కుటుంబసభ్యుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టించాయి.

అంత్యక్రియల్లో పాల్గొన్న ప్ర భుత్వ చీఫ్‌విప్
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటు ంబానికి చెందిన ముగ్గురు దు ర్మరణం పాలైన విషయాన్ని తె లుసుకున్న ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చందోళికి చేరుకుని అం త్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ ధర్మపురి ని యోజకవర్గ ఇంచార్జి అడ్లూరి లక్ష్మన్‌కుమార్, గొల్లప ల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు.