Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

క్రిస్ మోరిస్ స్ట్రయిక్ రేటు అద్భుతం

Moris

పుణె: ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తరఫున ఆడిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ క్రిస్ మోరిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. మంగళవారం రైజిం గ్ పుణె సూపర్‌జెయింట్స్(ఆర్‌పి ఎస్)తో ఆడిన మ్యాచ్‌లో నమ్మలేని స్ట్రయిక్ రేటు 422.22ను అజేయం గా నమోదు చేశాడు. తన సమకాలీ నుడు అల్బీ మోర్కెల్ చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) తరఫున 2012లో చెన్నైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగ ళూరు(ఆర్‌సిబి)పై చేసిన స్ట్రయిక్ రే టు రికార్డు 400.00(7లో 28)ను అధిగమించేశాడని ఐపిఎల్ టోర్నమెంట్ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. మోరిస్ ఆరో ఆటగాడిగా బరిలోకి దిగి పుణె జట్టుపై 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదేసి ఈ రికార్డు సాధిం చాడు. అతడు ఒక్క డాట్ బాల్ కూడా ఆడలేదు. ఆడమ్ జంపా, బెన్ స్టోక్స్ వేసిన బంతులను చెండాడేశాడు. 19 ఓవర్లో జంపా వేసిన ప్రతి బం తికి…1-4, 2-2, 3-6, 4-4 పరుగులు, అలాగే 20వ ఓవర్లో బెన్ స్టోక్స్ వేసిన ప్రతిబంతి లెక్కన చూస్తే 2-4, 3-2, 4-4, 5-6, 6-6 పరుగులు దంచేశాడు.

Comments

comments