Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఉత్తర కొరియాతో భేటీ అద్భుత విజయం: ట్రంప్

Trump

వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమవడం అద్భుత విజయమని తన మంత్రివర్గ సహచరులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జూన్ 12న సింగపూర్‌లో ఇరువురు నేతల భేటీ  అనంతరం   మొదటిసారిగా ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించారు. మనకు అద్భుత విజయమని, నమ్మశక్యం గాని అనుభవమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. బాలిస్టిక్  సహా ఇతర క్షిపణులను  పంపడం నిలిపి వేశారన్నారు. ఇది వరకే క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశారని, సంపూర్ణ అణు నిరాయుధీకరణ ప్రారంభమైనట్లు మంత్రివర్గ సభ్యులకు ట్రంప్ వివరించారు. ఇరు దేశాల సంబంధాలోల ఘననీయమైన పురోగతి సాధించినట్లు సెక్రటరీ స్టేట్ మైక్ పొంపియో తెలిపారు.

Comments

comments