Home లైఫ్ స్టైల్ గ్రీన్ యాపిల్ తో ఆస్తమాకు చెక్

గ్రీన్ యాపిల్ తో ఆస్తమాకు చెక్

Green-Appleప్రతి రోజూ గ్రీన్ యాపిల్ తినడం వలన ఎన్నో లాభాలున్నాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షిస్తాయి. కీళ్ల నొప్పులు రాకుండా అరికడతాయి. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. వయసు పై బడిన వారిలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. చేతులు వణకడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి వాటిని గ్రీన్ యాపిల్‌తో చెక్ పెట్టవచ్చు. యాపిల్ రసం తీసుకుంటే ఆస్తమా కూడా తగ్గుతుందని నిపుణులంటున్నారు. మధుమేహ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. చర్మ సంబంధ ఇబ్బందులన్నిటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిలోని పీచు పదార్థం, లవణాలు, విటమిన్లు ప్రత్యక్షంగా కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.