Home మహబూబ్‌నగర్ హరిత హారంలా పంటపొలాలు..

హరిత హారంలా పంటపొలాలు..

vvv

మన తెలంగాణ/పెబ్బేరుః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద ఉన్న చెరువులకు జలకళ ఉట్టిపడుతుంది. ఖరీఫ్ సీజన్‌లో వేసిన వరిసాగు,వేరుశనగ పంటలతో వ్యవసాయ పంట పొలాలు హరిత హారంలా కనిపిస్తు న్నాయి. పెబ్బేరు మండలంలో వీరసముద్రం,మహబూబ్‌పాల్ సముద్రం చెర్వులు లిఫ్ట్‌ల ద్వారా నింపడంతో వాటి పరిధిలోని పంట పొలాలు పచ్చధనంతో కలకళలాడుతున్నాయి. ఈఏడాది వర్షాలు అంతంత మాత్రంగా ఉండడంతో కేవలం జూరాల,రామన్‌పాడు,ప్రాజెక్టుల్లోని నీళ్లు వ్యవసాయానికి తోడ్పడుతు న్నాయి. మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను అత్యధికంగా 18 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా 14 వేల హెక్టార్లలో వేరుశనగను సాగుచేస్తున్నారు.

ప్రభుత్వం ముందస్తుగా రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో ఖరీఫ్ ,రబీ సీజన్‌ల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర వ్వలేదు. రెండవ విడత రైతుబంధు పథకాన్ని రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుండడంతో గతంలో మాదిరిగా బయట అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెబ్బేరు మండలంలో వ్యవసాయ మార్కెట్ ఉండడం వల్ల రైతులు తాము పండించిన ధాన్యాన్ని సమీపం లోనే విక్రయించడానికి అవకాశం ఉంది. గత ఏడాది వరి అత్యధికంగా సాగు చేసినప్పటికి క్వింటాల్‌కు రూ.1820 ధర నిర్ణయిం చారు. దీంతో ఈ ఏడాది కూడా అదే ధర లభిస్తుందని వ్యవసాయాన్నే ప్రధాన పంటగా ఎంచుకున్నారు. ఏది ఏమైనా రైతులు వ్యవసాయం పట్ల మక్కువ చూపడానికి కారణం ప్రభుత్వం అందింస్తున్న ఆదరణ అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Green Crops in villages