Home వార్తలు పచ్చ జుట్టు పొట్టివాడు

పచ్చ జుట్టు పొట్టివాడు

page6నీళ్ళ తొట్టిలో జోకర్ బొమ్మలాంటి తల. దానిపై పచ్చటి గడ్డి… చూడగానే ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవడం వల్ల పచ్చదనం ప్రశాంతతనిస్తూ పాజిటివ్ ఆలోచనలను పెంచు తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక. దీనికి కావలసినవి గాజు తొట్టి, లావుపాటి దారపు పురికోస, కొద్దిగా వరి లేదా జొన్న విత్తనాలు, కళ్లు, ముక్కు దిద్దుకోడానికి కలర్ పేపర్. మట్టిని తడిచేసి గుండ్రని బంతిలా చేసుకునేటప్పుడే దీనిలోపల దారాన్ని ఉంచాలి. ఇప్పుడు ఈ బంతిని తాడు నీళ్ళలో ఉండేలా అమర్చుకోవాలి. పై భాగంలో విత్తనాలు అద్ది పై పూతగా మరికాస్త తడిమట్టిని అద్దాలి. కళ్ళు ముక్కు మీకు నచ్చినట్టు అందంగా పేపర్లతో కట్ చేసి ఫెవికాల్‌తో అంటించండి. రెండు మూడు రోజుల్లో మొలకలు వచ్చి గడ్డి పెరుగుతుంది. ఈ పొట్టివాడు కొన్నాళ్ళ పాటు మీ కంటికి ఆహ్లాదాన్ని పంచుతాడు.