Home జిల్లాలు ఆకుపచ్చ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

ఆకుపచ్చ తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

sudhr-reddyపలు గ్రామాల్లో హరితహరంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఘట్‌కేసర్ రూరల్ : ఆకుపచ్చ తెలంగాణే లక్షంగా ప్రభుత్వం హరితహరం కార్యక్రమాన్ని చేపట్టిందని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పేర్కోన్నారు. మండల పరిధిలోని ఎన్‌ఎఫ్‌సినగర్, ఏదులాబాదు, అంకుశాపూర్, అవుశాపూర్ గ్రామాలలో అదివారం అయన హరితహరం కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలు నాటాలని అయా గ్రామాల సర్పంచ్‌లకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. 33 శాతం ఉండాల్సిన వన సంపద ప్రస్తుతం 21 శాతం మాత్రమే ఉందని అన్నారు. హరితహరం ఇలా కొనసాగితే నాలుగైదు సంవత్సారాలలో 33 శాతం వరకు వన సంపద పెరుగుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి రెండు మొక్కలు నాటాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని అధికారులకు సూచించారు. పంచాయితీ రాజ్, రెవెన్యూ, అటవి, ఇరిగేషన్ శాఖల అధికారులు తమ కార్యాలయ వద్ద హరితహరం కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటాలని తెలిపారు. అకు పచ్చ తెలంగాణలో అందరు భాగస్వాములు కావాలన్నారు. వనాలు ఉంటేనే వర్షాలు సంవృద్దిగా పడుతాయని తెలిపారు. వర్షాలతోనే వ్యవసాయ రంగం వృద్దిలోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, అయా గ్రామాల సర్పంచ్‌లు పోతబత్తిని స్టీవెన్, బట్టె శంకర్, బద్దం అర్చన నర్సింహ్మరెడ్డి, పెద్దోళ్ల రమేష్, ఎంపీటీసీ సభ్యులు రమేష్, కాలేరు సురేష్, మంకం రవి, కె. కరుణాకర్, కొట్టి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర విత్తన దృవీకరణ అప్పీలేట్ అధారిటి సభ్యుడు రేసు లకా్ష్మరెడ్డి, తహసీల్దారు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడిఓ కె. శోభ, ఉపసర్పంచ్‌లు యంపాల సుధాకర్‌రెడ్డి, అకిటి సుధాకర్‌రెడ్డి, ఏనుగు సుధర్శన్‌రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొంతం అంజిరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ డొక్కెని భిక్షపతిగౌడ్, అధికారులు వ్యవసాయ అధికారిణి శ్రీవాణి, ఇరిగేషన్ ఎఈ నివేధిత, ఎఈఓ సురేష్‌రెడ్డి, వార్డు సభ్యులు శ్రీకాంత్, కోమ్మగోని రమాదేవి, విమల, చందుపట్ల వెంకట్‌రెడ్డి, లక్ష్మమ్మ, ఎం.కె కొండమ్మ, బింగి యుగేందర్‌గౌడ్, మొట్టు రమేష్, బింగి సురేష్‌గౌడ్, అబ్బోల్ల ఇందిరా, పిట్టల రాజు, గంగి శంకర్, సాయిలు, నాయకులు టీఅర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కందుల కుమార్ ముదిరాజ్, చిలుగూరి మంకయ్య, బద్దం జగన్‌మోహన్‌రెడ్డి, చిన్న నర్సింహ్మగౌడ్, చందుపట్ల లకా్ష్మరెడ్డి, లింగుస్వామి, బట్టె లక్ష్మన్, ప్రవీణ్‌రెడ్డి, హరినాధ్, కట్ట నర్సింహ్మరెడ్డి, వెంకట నారాయణ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే
మన తెలంగాణ/కీసర : పేదలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన కె.సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.51 వేల విలువ చేసే చెక్‌ను ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు ఎం.రవికాంత్ ముదిరాజ్, సర్పంచ్‌లు బి.నానునాయక్, కె.చంద్రారెడ్డి, నాయకులు ఆర్.శ్రావణ్‌కుమార్ గుప్త, కె.బాల్‌రెడ్డి పాల్గొన్నారు.