Home తాజా వార్తలు మహిళా కండక్టర్లకు గ్రీన్ టాయిలెట్లు..

మహిళా కండక్టర్లకు గ్రీన్ టాయిలెట్లు..

Mahender-Reddy-DONE-IMAGE-Dహైదరాబాద్ : తెలంగాణ ఆర్‌టిసిలో మహిళా  పాత్ర ఎంతో కీలకమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. టిఎస్‌ఆర్‌టిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ అర్‌టిసి అభివృద్ధిలో కీలకంగా మారిన మహిళా కండక్టర్లకు కోసం ప్రత్యేకంగా గ్రీన్ టాయిటెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండలోని పిఆర్‌టియు భవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి హాజరైన ఎమెల్సీ పూల రవీందర్ ఉత్తమ టీచర్లకు సన్మానించారు.