Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

నాల్గో విడత హరితహారాన్ని ఉద్యమంలా నిర్వహించాలి

Greenery should be done in schools

పాఠశాలల్లో పచ్చదనం పరిమళించాలి
230 కోట్ల మొక్కలు నాటాలన్నా కేసీఆర్ ఆశయాన్ని అమలు చేయాలి
హరితహారంపై మంత్రి సమీక్ష
మంత్రి జగదీశ్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేటటౌన్ : హరితహారం నాలుగవ విడత కార్యక్ర మా న్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, గురుకుల పాఠశా ల ల్లో విరివిగా మొక్కలు నాటించాలని, ఉపాధ్యాయులు, ప్రజలు, ప్రతి విభాగ ఉద్యోగులు హరితహారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంపిడిఓలు, అటవీ, ఎక్సైజ్, డిఆర్‌డిఎ, ఈఓఆర్డి, ఎంఈఓలు, ఉపాధిహామీ సి బ్బంది, పంచాయతీ సెక్రటరీలతో నాలుగవ విడత హరితహారంపై సమీక్షించిన సందర్బంగా ఆయన మాట్లాడారు.అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో హరిత హారంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి అవగాహన కల్పించాల న్నారు. హరితహారం మొదటి రోజు అన్ని గ్రామాలలో విద్యార్థులతో ర్యాలీ నిర్వ హించాలని సూచించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో కూడా అధికా రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, అంగన్‌వాడీలు, ఆ శావర్క ర్లు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేయా లన్నా రు. సూర్యాపేట నుండి దంతాలపల్లి, సూర్యాపేట నుండి జనగాం, దు రాజ్‌పల్లి నుండి గరిడేపల్లి రహదారికిరువైపులా మొక్కలు నాటాలని చెప్పారు. చెరువు తోతట్టు ప్రాంతాలలో ఇరిగేషన్ అధికారులు నల్లతుమ్మ, నేరెడు, గానుగ మొక్క లు నాటాలని డిఆర్‌డిఎ, ఎంపిడిఓలు ఇచ్చే సూచనలకు
అనుగుణంగా ప్రతి ఇంటికి మొక్కలు సరఫరా చేసి చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని అన్ని సిమెంట్ కంపెనీలు, మైనింగ్, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో విరివిగా మొక్కలు నాటి విత్తనాలు చల్లాలని, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడాలలో మొక్కలు నాటాలన్నారు. ఐదు సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న కేసీఆర్ లక్షం, ఆకాంక్ష, ఆశయాన్ని ప్రతి తెలంగాణ పౌరుడు సాధించుటలో బాగస్వామ్యం కావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ నాలుగవ విడత హరితహారంలో భాగంగా జిల్లాలో ఒక కోటి 39 లక్షల మొక్కలు నాటే విధంగా లక్షం నిర్ధేశించామని, జిల్లాలో మొక్కలకు ఎటువంటి కొరత లేదన్నారు.ఈ సమీక్షా సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, జెసీ సంజీవరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డిఆర్‌డిఎ పిడి కిరణ్‌కుమార్, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎ బాబురావు, సిపిఓ సుబ్బారావు, డిఈఓ చైతన్యజైనీ, పౌర సరఫరా సంస్థ జీఎం రాంపతి ,సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

comments