Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మెచ్చుకున్న మహేష్‌బాబు

maheshసందీప్‌కిషన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్‌లుగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌కు యూ ట్యూబ్‌లో ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు సైతం మెచ్చుకోవడం గమనార్హం. ‘టక్కరి దొంగ’ సినిమా రోజుల నుండి దర్శకుడు రాజసింహకు మహేష్‌బాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమంలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను మహేష్‌కు చూపించడం జరిగింది. చిత్రం కథ గురించి… కథనం గురించి తెలుసుకున్న మహేష్‌బాబు.. రాజసింహ చూపించిన ట్రైలర్‌ను చూసి ఎంతో మెచ్చుకున్నారు. చిత్రంలోని గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగుంది అని ప్రత్యేకంగా మహేష్‌బాబు అభినందించారు.

Comments

comments