Home అంతర్జాతీయ వార్తలు మెక్సికోలోని అమెరికా కాన్సులేట్ పై గ్రనేడ్ దాడి!

మెక్సికోలోని అమెరికా కాన్సులేట్ పై గ్రనేడ్ దాడి!

Grenade attack at US Consulate in Mexicoమెక్సికో సిటీ: మెక్సికోలోని అమెరికా దౌత్య కార్యాలయంపై గ్రనేడ్ దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ రాకకు కొద్ది ముందు ఈ దాడి జరగడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. కాగా, ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై ఫెడరల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.