Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

గ్రూప్-2 దరఖాస్తులు 7,89,985

వచ్చేనెల పరీక్షలకు ముమ్మరంగా ఏర్పాట్లు 

tspscమన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతు న్నాయి. వచ్చే నెల 11, 13 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు, నాలుగు పేపర్లకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఎస్‌పిఎస్‌సి జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,89,985 దరఖాస్తులు వచ్చాయి. ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు హాజరుకానున్న నేపథ్యంలో సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రాజీవ్‌శర్మ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రూప్-2 పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఎక్కడా లోపాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల నిర్వహణకు విద్యుత్ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్టీసీలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులకు అసౌ కర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు టిఎస్ పిఎస్సీ సభ్యులు జిల్లాలు పర్యటించి పరీక్షల నిర్వహణకు పరిశీలించనున్నారు. జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. పరీక్షలకు నిర్వహించే విధానంపై ఇన్విజిలేటర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలకు వారం రోజుల ముందే టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరచనున్నందున, పరీక్షా కేంద్రాల ఏర్పాట్లపై ముమ్మర కరసత్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోనే అధికం
గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లో హైదరాబాద్‌లో పరీక్ష లు రాసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 2,94,480 మంది అభ్యర్థులు హైదరాబాద్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఇక్కడే అధిక సంఖ్యలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనునున్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌కు 60,512 మంది, రంగారెడ్డికి 25,234 మంది, మెదక్‌కు 29,867 మంది అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. నిజామాబాద్‌కు 43,359, అదిలాబాద్‌కు 22,831, కరీంనగర్‌కు 97,929, వరంగల్‌కు, 97,870, ఖమ్మంకు 62,372, నల్గొండకు 55,531 మంది అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అభ్యర్థుల ప్రాధాన్యత క్రమాన్ని బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు.

Comments

comments