Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

త్వరలో గ్రూప్-3 ఫలితాలు

ap

అమరావతి: విజయవాడలో బందరు రోడ్డులోని ఎపిపిఎస్సి కార్యాలయ్యాన్ని చైర్మన్ ఉదయ్‌భాస్కర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనవరి నుంచి ఎపిపిఎస్సి కార్యకలాపాలు విజయవాడలోనే జరుగుతాయని, త్వరలోనే విశ్వవిద్యాలయాల్లోని పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో 1,055 పోస్టులకు నిర్వహించిన గ్రూప్-3 ఫలితాలను వెల్లడిస్తామన్నారు. జనవరిలో గ్రూప్-2 ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, జనవరి 22 నుంచి 2011 గ్రూప్-1 అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Comments

comments