Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పెరగనున్న ప్రభుత్వ ఆదాయం

Growth Government Income

ఎసి, సిమెంట్, టివిలపై జిఎస్‌టి తగ్గింపుతో సానుకూలం : అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: సిమెంట్, ఎసిలు, టెలివిజన్లపై జిఎస్‌టి రేటు తగ్గింపుతో పన్ను ఆదాయం మరింత పెరిగే అవకాశముందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి లగ్జరీ, హానికర వస్తువులపై మాత్ర మే అత్యధిక పన్ను 28% శ్లాబ్ ఉంటుందని అన్నారు. జిఎస్‌టి అమలు చేయడానికి ముందు పరోక్ష పన్ను భారం ఎక్కువగా ఉందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లో 31 శాతం వరకు పన్ను చెల్లించాల్సి వచ్చిందని జైట్లీ విమర్శించారు. పేస్‌బుక్‌లో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. గత ఏడాదిలో దాదాపు 384 వస్తువులకు రేటు తగ్గిందని అన్నారు. స్థానిక పన్నులతో కలిగి జిఎస్‌టిని 2017 జులై 1న ప్రారంభించిన విషయం తెలిసిందే. 28% శ్లాబ్ నుంచి చాలా వస్తువులు వైదొలిగాయని, ఇప్పుడు ఈ కేటగిరీలో లగ్జరీ, హానికర వస్తువులు మాత్రమే ఉన్నాయని అన్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయం పెరగనుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొన్ని వస్తువులు కూడా కేటగిరీ నుంచి మారనున్నాయని అన్నారు. 13 నెలల కాలంలో జిఎస్‌టి మండలి చాలా వరకు వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి తొలగించిందని అన్నారు. జిఎస్‌టిలో ఇటీవల తగ్గిన వస్తువుల రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చా యి. 28 శతం పన్ను స్లాబ్ నుంచి 18 శాతానికి తగ్గిన వస్తువుల జాబితాలో ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ లు, కూలర్లు, ఐస్ క్రీమ్, ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్లు, హ్యాండ్ డ్రైయెస్ సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాలు, పెయింట్, వాక్యుమ్ క్లీనర్స్, గ్రైండర్, మిక్సర్లు, స్టోరేజ్ నీటి హీటర్లు ఉన్నాయి. కాగా జిఎస్‌టి నమోదు పన్ను చెల్లింపుదారులు కోసం గడువు ఆగస్టు 31 వరకు తుది పొడిగించారు. అరుణ్ జైట్లీ మూత్ర పిండాల చికిత్స కోసం వెళ్లడంతో ఆయన స్థానంలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా పీయూష్ గోయల్ బాధ్యతలు చేపట్టారు. తాత్కాలికంగా ఆర్థిక మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న గోయ ల్ జిఎస్‌టి మండలికి అధ్యక్ష బాధ్యత వహిస్తున్నారు. తదుపరి జి ఎస్టి కౌన్సిల్ సమావేశము ఆగస్టు 4న జరగనుంది, దేశంలో చిన్న వర్తకులు, వ్యాపారాలు, మరియు వ్యవస్థాపకత ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. ఈ సమావేశం చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది.

Comments

comments