Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌ఎల్‌వి ఎంకె -౩ ప్రయోగం నేడే

racket

హైదరాబాద్: భారీ వాహక సామర్థం గల జిఎస్‌ఎల్‌వి ఎంకె 3 వాహక నౌక (రాకెట్) ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం సా॥ 5.28 గంటలకు నెల్లూరు లోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేం ద్రం నుంచి దీనిని ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ఇస్రోకు అత్యంత కీలకమైనదని సంస్థ మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ తెలిపారు. ఇది ఇస్రో చరిత్రలో మైలురాయిగా ఉంటుం దని ఆయన వెల్లడించారు.  ఆదివారం మధ్యాహ్నం 3. 58 గంటలకు ఈ రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది. ఈ రాకెట్ ద్వారా దాదాపు 3136 కిలోల బరువుండే  కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూ కక్షలోకి ప్రయోగి స్తారు.   2-2.3 టన్నులు, 3.5- 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను మో సుకువెళ్లగలిగే సామర్థం సంతరించుకునేందుకు ఈ ప్రయోగం కీలకం గా మారింది. దీని వల్ల ఈ రాకెట్ వాహక సామర్థం ఇప్పుడున్న దానిక న్నా రెండింతలు అవుతుందని రాధాకృష్ణన్ తెలిపారు. ఇప్పటివరకూ మనం రెండున్నర టన్నుల బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించాలను కుంటే అందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రత్యేకించి సమాచార ఉప గ్రహాల ప్రయోగాలలో ఇప్పటివరకూ ఉన్న బలహీనతలను ఈ ప్రయోగం తో అధిగమించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఒక్కసారి జిఎస్‌ఎల్ వి ఎంకె 3 సామర్థక శక్తి రుజువైతే, ఈ ప్రయోగం విజయవంతం అయి తే మనం ఇక ముందు విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో ద్వారా ప్రయో గించేందుకు వీలవుతుందని ఈ మాజీ సారథి తెలిపారు. ‘ఇది సరళీకృత వాహనం. అయితే అత్యధిక పేలోడ్ సామర్థంతో ఉంటుంది. ఇది భవి ష్యత్తులో ఇస్రోకు ఖచ్చితంగా విశ్వసనీయ వాహకనౌకగా మారు తుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 17 ఏళ్లుగా ఇస్రో ఈ రాకెట్ కోసం కసరత్తు సాగిస్తోంది. ఈ రాకెట్ శక్తి సామర్థాలు ఇను మడింపచేసే ఘననీయ  కార్యక్రమానికి 2౦౦౦ సంవత్సరంలో ఈ ప్రాజె క్టుకు అనుమతి దక్కింది. అప్పట్లో రాధాకృష్ణన్ విక్రమ్ సారాభాయ్ అంత రిక్ష కేంద్రం డైరెక్టర్‌గా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. తరువాత ఇస్రో ఛైర్మన్‌గా ఉన్నారు. రిటైరయిన తరువాత ఆయన సంస్థకు సలహా దా రుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రయోగం ఇస్రో చిరకాలపు కలగా ఉందని ఆయన వివరించారు. ఉపగ్రహ వాహక నౌకల శ్రేణులలో పిఎస్ ఎల్‌వి సామర్థం ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. జిఎస్‌ఎల్‌వి శ్రేణి వాటిక న్నా మెరుగ్గా ఉంది. ఇప్పుడు ఈ ప్రయోగంతో జిఎస్‌ఎల్‌వి సామర్థం మరింత పెరగడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు రంగం సిద్ధం అవుతుందని రాధాకృష్ణన్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే దాదాపుగా 6,౦౦౦ కిలోల బరువుండే శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

Comments

comments