Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పండుగ వాతావరణం తీసుకొచ్చిన జిఎస్‌టి

ఈ నెలలోగా స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు రిటైలర్ల డిస్కౌంట్ ఆఫర్లు

Festన్యూఢిల్లీ : జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలులోకి రావడానికి ముందు పండుగ వాతావరణం నెలకొంటోం ది. కొన్ని వస్తువులు మరింత చౌకగా లభించనున్నాయి. జూలై లోగా కార్లు, ఎయిర్ కండిషనర్ వంటి వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. రిటైలర్లు పలు వస్తువులు, కన్జూమర్ డ్యూరబుల్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రక టిస్తున్నాయి. కార్ల కంపెనీలు కూడా డిస్కౌంట్లను మరిం తగా పెంచుతున్నాయి. వచ్చే నెల నుంచి జిఎస్‌టి అమలు కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు రిటైలర్లు ఆఫర్లకు తెరతీశారు.
కన్జూమర్ డ్యూరబుల్స్‌పై డిస్కౌంట్లు
జూన్ నెలలో తొలిసారిగా తాము 25 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించామని విజయ్ సేల్స్ ఎండి నీలేష్ గుప్తా అన్నారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండి షనర్లు వంటి వాటిపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నామని, అలాగే టీవీలు, వాషింగ్ మెషిన్ వంటి ఇతర విభాగాల్లో డిస్కౌంట్లను పెంచామని అన్నారు. దేశంలోని ఢిల్లీ, ముం బయి, పుణె వంటి నగరాల్లో విజయ్ సేల్స్ మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. వేసవి కారమంగా ఏప్రిల్, మే నెలలో కన్జ్యూమర్ గూడ్స్ రిటైలర్లు భారీ సంఖ్య సేల్స్ ను నమోదు చేశారు. జూన్‌లో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయితే జూలై నుంచి జిఎస్‌టి అమల్లోకి రా నుండడంతో ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను ఎలాగైనా విక్ర యించాలని రిటైలర్లు భావిస్తున్నారు. నిల్వ ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్ల ఎరవేస్తున్నా రు. జిఎస్‌టి శ్లాబ్ 18 శాతంలో ఉత్పత్తులకు 60 శాతం ఇన్‌పుట్ క్రెడిట్ పెంపునకు జిఎస్‌టి కౌన్సిల్ అంగీకరిం చింది. జిఎస్‌టి శ్లాబ్‌లో 28 శాతం పన్ను రేటు పరిధిలోకి కన్జూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు రానున్నాయి.
కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు
వివిధ వాహన తయారీదారులు, కంపెనీల డీలర్లు కార్ల ధరలను భారీగా తగ్గించారు. వివిధ మోడళ్లపై డిస్కౌంట్ల ను మరింతగా పెంచారు. దీంతో కార్ల ధరలు రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు తగ్గించారు. జిఎస్‌టి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఉన్న స్టాక్‌ను జూన్ నెలలోనే విక్ర యించుకోవాలని కంపెనీ భావిస్తున్నాయి. మారుతి వా గానర్‌పై డిస్కౌంట్ గతంలో ఉన్న రూ.20వేలు నుంచి రూ.3 0వేలకు.. స్విఫ్ట్‌పై రూ.10వేల నుంచి రూ.20వే లకు పెంచారు. సెలెరోపై రూ. 20వేల వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆల్టో పై ప్రస్తుతం ఉన్న నగదు తగ్గింపును రూ. 30వేలనుంచి మరో అయిదువేలకు పెంచింది. ఈ డిస్కౌంట్‌తోపాటు ఉచిత భీమా, లాభదా యక బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తు న్నాయి. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన అనంతరం ఎలక్ట్రిక్ వాహనాలు, పెద్దఎస్‌యూవీలపై అధిక పన్ను రేటు పడ నుంది. ఢిల్లీ, కోలకతా వంటి నగరాల్లో మారుతి డీలర్లు ఆల్టో, వాగాన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్ వంటి వాహనాలపై జూన్ 31 లోపు కొనుగోలు చేసిన కస్టమర్లకు నగదు రాయితీలను ప్రకటించాయి. ఇదే బాటలో పయనించిన హుందాయ్ డీలర్లు కూడా తమ కార్లపై డిస్కౌంట్లను రెట్టింపు చేశాయి. ఇయాన్, గ్రాండ్ ఐ10 పై తగ్గింపు రేటును ప్రకటించింది. మహీంద్ర అండ్ మహీంద్ర ఎక్స్‌యూవీ 500పై లక్షలవరకు డిస్కౌంట్ అందిస్తోంది. టొయోటాకు చెందిన ఇన్నోవా, ఫార్చూనర్ ధరలు కూడా దిగిరానున్నాయి. టొయాటో డీలర్లు మాత్రం ఇం కా ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు.

Comments

comments