Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

సిగరేట్లపై సుంకం పెంపు : జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం

GST-Councilన్యూఢిల్లీ: సిగరెట్లపై సుంకాన్ని పెంచాలని తాజాగా జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుంది. సిగరెట్లపై అత్యధిక సుంకంతో ఆదాయ వృద్ధి రూ.5000 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. సిగరెట్లపై ఇప్పటికే జిఎస్‌టి రేటు 28 శాతం ఉంది. అలాగే 5 శాతం సుంకం విధిస్తారు. నిర్థారిత సుంకం వెయ్యి స్టిక్స్‌కు రూ.485 నుంచి రూ.792 పెరగనుంది. జులై 1న జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలు అయిన తర్వాత కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి. కౌన్సిల్ అత్యవసర సమావేశం తర్వాత మీడియాతో జైట్లీ మాట్లాడుతూ, సిగరెట్లపై జిఎస్‌టి రేటు విషయమై తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Comments

comments