Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి కౌన్సిల్ భేటీపై నోట్ల రద్దు ఎఫెక్ట్

అసంపూర్తిగా ముగిసిన సమావేశం  

ఏప్రిల్ 1 టార్గెట్ సాధ్యమయ్యేనా?

GStన్యూఢిల్లీ : జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలనే ప్రభుత్వం లక్షం ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపించడం లేదు. జిఎస్‌టి పన్నుల నియంత్రణ విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. అంతర్ రాష్ట్ర వ్యాపారం చేసే వ్యాపారుల పై ఎవరి నియంత్రణ ఉండాలన్న దానిపై నెలకొన్న విభేదాలు కొలిక్కి వచ్చేలా లేవు. ఆరోసారి కౌన్సిల్ భేటీ అసంపూర్తిగానే ముగిసింది. రెండు రోజుల ఈ సమావేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా కనిపించింది. నోట్ల రద్దు కారణంగా తాము భారీగా నష్టపోతున్నామనే బాధ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండ డం, ఇదే సమయంలో రాష్ట్రంలో వ్యాపారులపై నియంత్రణకు కేంద్రం పెత్తనం పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లా డుతూ, ఏప్రిల్ 1 టార్గెట్ మిస్ అవనుంది, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ గడువు సాధ్యం కాదని చెబుతున్నాయని, సెప్టెంబర్ నుంచి జిఎస్‌టి ప్రారంభం కావొచ్చన్నారు. ముసాయిదా బిల్లులో 195 సెక్షన్‌లు ఉండగా, వీటిలో 99 సెక్షన్‌లను మాత్రమే చర్చించామని, వచ్చే సమావేశంలో మిగతా వాటిపై చర్చిస్తామని జైట్లీ అన్నారు. ఈనెల 22-23 తేదీల్లో మరోసారి జిఎస్‌టి కౌన్సిల్ భేటీ కానుంది. రాష్ట్రాల నమ్మకాన్ని పెద్ద నోట్ల రద్దు తుడిచిపెట్టేసిందని కేరళ ముఖ్యమంత్రి థామస్ అన్నారు. ఏప్రిల్ 1 అమలు సాధ్యం కాదని, సెప్టెంబర్‌లో ప్రారంభం కావొచ్చని అన్నారు. కేంద్ర జిఎస్‌టి, రాష్ట్రాల ముసాయిదా జిఎస్‌టిల బిల్లులపై మాత్రం కొంత అంగీకా రం కుదిరింది. అయితే జిఎస్‌టి అమలు కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల పాలనా వ్యవస్థలకు సంబం ధించిన మౌలిక సదపాయాలు ఉప యోగించుకోవడానికి వీలు కల్పించే సమగ్ర జిఎస్‌టి ముసాయిదా బిల్లుపై ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. దీంతో ఈ నెల 16న ముగిసే ప్రస్తుత సమావేశాల్లోనే ఈ ముసాయిదా బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంపై సందేహా లు వ్యక్తం అవుతున్నాయి. ఈ బిల్లులకు తుది రూపం ఇవ్వడంతో పాటు సమగ్ర జిఎస్‌టి బిల్లులపై చర్చించేందుకు మళ్లీ సమావేశం అవుతున్నామని జైట్లీ తెలిపారు.

Comments

comments